సీరియ‌ల్ నిర్మాత‌గా మారిన డైర‌క్ట‌ర్‌

  • IndiaGlitz, [Monday,March 04 2019]

క‌న్న‌డ‌, తెలుగు, త‌మిళ్‌లో సినిమాలు చేసిన టాప్ డైర‌క్ట‌ర్ ర‌మేష్ అర‌వింద్‌. క‌మ‌ల్‌హాస‌న్‌తో ప‌లు సినిమాలు చేసిన ర‌మేష్ అర‌వింద్ న‌టుడిగానూ సుప్ర‌సిద్ధుడు. బెంగుళూరులో ఉంటున్నా ఆయ‌న తాజాగా టీవీ సీరియ‌ల్‌ను నిర్మిస్తున్నారు.

ఓ వైపు సినిమాలు, మ‌రోవైపు రియాలిటీ షోలు చేస్తున్న ఆయ‌న‌కు టీవీ సీరియ‌ల్‌ను నిర్మించాల‌నే కోరిక ఎందుకు పుట్టింది? అని అడిగితే.. ర‌మేష్ అర‌వింద్ ఇలా స‌మాధాన‌మిచ్చారు.. ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్‌టైన్ చేసే విష‌యం ఎక్క‌డున్నా నేను ఆస‌క్తి చూపిస్తా. నితిన్ చెప్పిన 'నందిని' అనే క‌థ నాకు చాలా బాగా న‌చ్చింది.

నిత్యా రామ్‌, కావ్యా శాస్త్రి ఇందులో నాయిక‌లు. మంచీ,చెడుకు మ‌ధ్య జ‌రిగే ఘ‌ర్ష‌ణ‌గా ఈ సీరియ‌ల్ ఉంటుంది. ప్ర‌తి ఎపిసోడ్ ఆక‌ట్టుకుంటుంది. ఇవాళ టీవీ రంగం చాలా పెద్ద‌ది. ఈ నేప‌థ్యంలో ఆ రంగంలో అడుగుపెట్ట‌డం ఆనందంగా ఉంది అని అన్నారు.