చిరు సినిమా కోసం ప్రయత్నిస్తున్న డైరెక్టర్..
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా కోసం గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ...క్లారిటి మాత్రం రావడం లేదు. చిరు 150వ సినిమా ప్రకటన దసరాకి రావడం ఖాయం అన్నారు. కానీ రాలేదు. దసరా..దీపావళీ వెళ్లిపోయాయి. క్రిస్మెస్ కూడా వచ్చేస్తుంది. కానీ చిరు 150 వ సినిమా ఎనౌన్స్ మెంట్ మాత్రం రావడం లేదు. తాజాగా సంక్రాంతికి చిరు 150వ సినిమా ఎనౌన్స్ మెంట్ రావడం పక్కా అంటున్నారు.
ఇదిలా ఉంటే...ఈ ప్రతిష్టాత్మకమైన చిత్రాన్ని తెరకెక్కించే డైరెక్టర్స్ లిస్ట్ లో పూరి జగన్నాథ్, వినాయక్ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. అయితే వినాయక్ అఖిల్ సినిమా రిలీజ్ కి ముందు చిరు సినిమా చేయడానికి అంతగా ఆసక్తి చూపించలేదట. అఖిల్ మూవీ తర్వాత ఎన్టీఆర్ తో అదుర్స్ 2 చేయాలనుకున్నారట. కానీ..అఖిల్ మూవీ ప్లాప్ అయ్యింది. ఎన్టీఆర్ తో సినిమా చేద్దాం అనుకుంటే ఎన్టీఆర్ కోసం చాలా రోజులు వెయిట్ చేయాలి. ఇక మిగిలింది చిరుతో సినిమా చేయడమే. అందుకనే ఈమధ్య తరుచు చిరును వినాయక్ కలుస్తున్నాడట. చిరు 150వ సినిమాని వినాయక్ డైరెక్ట్ చేయడం ఖాయం అంటున్నారు. పరుచూరి బ్రదర్స్ తాజాగా చిరు కోసం ఓ కథ సిద్ధం చేసారట.
మరి...చిరు 150వ సినిమాగా వినాయక్ కత్తి రీమేక్ చేస్తాడా..? లేక పరుచూరి కథని తెరకెక్కిస్తాడనేది తెలియాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com