సితార ఎంటర్టైన్మెంట్స్ కొత్త చిత్రం లాంచ్ చేసిన త్రివిక్రమ్!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు హారికా అండ్ హాసిని, సితార ఎంటర్టైన్మెంట్ సంస్థలు హోమ్ బ్యానర్ లాంటివే అని చెప్పాలి. అంతలా త్రివిక్రమ్, నిర్మాత రాధాకృష్ణ మధ్య సాన్నిహిత్యం ఉంది. తాజాగా సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ మరో కొత్త చిత్రాన్ని ప్రారంభించింది.

ఇదీ చదవండి: కనువిందు చేసే ఒంపుసొంపులతో నిఖిల్ హీరోయిన్ బికినీ ఫోజు

యువ హీరో సిద్దు జొన్నలగడ్డ కథానాయకుడిగా శౌరి చంద్రశేఖర్ టి. రమేష్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. రమేష్ కు దర్శకుడిగా ఇది డెబ్యూ మూవీ. ఈ ఉదయం 9:09 గంటలకు పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఈ చిత్రాన్ని ప్రారంభించారు.

త్రివిక్రమ్ దేవతల చిత్రపటాలు ముందు క్లాప్ ఇవ్వడంతో ఈ చిత్రం ప్రారంభమైంది. పల్లెటూరి నేపథ్యంలో సాగే ప్రేమకథగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దబోతున్నట్లు దర్శకులు తెలిపారు. పల్లెటూరి నేపథ్యంలో ప్రేమ కథలో ఉండే అన్ని కోణాలని ఈ చిత్రంలో ఆవిష్కరించబోతున్నట్లు తెలిపారు. తమిళ నటుడు అర్జున్ దాస్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు.

అర్జున్ దాస్ ఖైదీ చిత్రంలో విలన్ గా నటించిన సంగతి తెలిసిందే. స్వీకర్ అగస్తి ఈ చిత్రాన్ని సంగీతం అందిస్తున్నారు. సితార బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆగష్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. పవన్, రానా నటిస్తున్న అయ్యప్పన్ కోషియం రీమేక్ కూడా ఇదే బ్యానర్ లో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

More News

కనువిందు చేసే ఒంపుసొంపులతో నిఖిల్ హీరోయిన్ బికినీ ఫోజు

బెంగాలీ భామ త్రిధా చౌదరి గుర్తుండే ఉంటుంది. నిఖిల్ నటించిన హిట్ మూవీ 'సూర్య వర్సస్ సూర్య' చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

నితిన్ తో పూజా హెగ్డే రొమాన్స్.. సూపర్ కాంబో సెట్ అయ్యిందిగా!

ప్రేమ కథలతో విసిగిపోయిన నితిన్ సరైన మాస్ చిత్రం కోసం ఎదురుచూస్తున్నాడు.

అల్లు అరవింద్ భారీ ప్లాన్.. లైన్ లోకి ఇలయథలపతి ?

బాహుబలి పుణ్యమా అని చిత్ర పరిశ్రమల మధ్య భాష అడ్డుగోడలు తొలగిపోయాయి.

లెజెండ్రీ నటుడు దిలీప్ కుమార్ మృతి.. మోడీ, రాహుల్, ఎన్టీఆర్ సంతాపం

లెజెండ్రీ బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్(98) బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.

హీరో సూర్యపై విమర్శల దాడి.. సీపీఎం, డివైఎఫ్ఐ మద్దతు!

నీట్ పరీక్షలు, సెన్సార్ చట్ట విధి విధానాలపై కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టారు స్టార్ హీరో సూర్య. నీట్ పరీక్షల వల్ల విద్యార్థులు నష్టపోతున్నారు అని సూర్య అన్నారు.