రాజశేఖర్ కుమార్తెను పరిచయం చేయనున్న దర్శకుడు

  • IndiaGlitz, [Thursday,March 09 2017]

చిత్రం, జ‌యం, నువ్వు నేను వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు తేజ ఇప్పుడు రానా, కాజ‌ల్ హీరో హీరోయిన్లుగా ఓ పొలిటికల్ థ్రిల్ల‌ర్ మూవీని తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఈ ద‌ర్శ‌కుడు సీనియ‌ర్ హీరో డా.రాజ‌శేఖ‌ర్ త‌న‌య శివాని రాజ‌శేఖ‌ర్‌ను హీరోయిన్‌గా తెలుగు తెర‌కు ప‌రిచ‌యం చేయ‌నున్నాడ‌ట‌.

రానా, కాజ‌ల్ సినిమా పూర్తి కాగానే శివానితో తేజ సినిమా ఉంటుంద‌ని స‌మాచారం. నిజానికి వంద‌కు వంద అనే సినిమాతో శివాని తెరంగేట్రం చేయాల్సింది. కానీ కుద‌ర‌లేదు. ఇప్పుడు తేజ‌సినిమాతో ఎంట్రీ ఇవ్వ‌నుంది. మ‌రి శివానితో తేజ ఎలాంటి సినిమా చేయ‌బోతున్నాడో తెలియాలంటే మ‌రికొన్ని రోజులు ఆగాల్సిందే.