Director Teja : ఆంధ్రా వాళ్లకి సిగ్గులేదు .. డైరెక్టర్ తేజ సంచలన వ్యాఖ్యలు

  • IndiaGlitz, [Monday,May 29 2023]

దర్శకుడు తేజ.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. రామ్‌గోపాల్ వర్మ స్కూల్ నుంచి వచ్చిన ఆయన తనదైన మార్క్ చూపించారు. ‘‘జయం’’, ‘‘నువ్వు నేను’’, ‘‘నిజం’’, ‘‘చిత్రం’’ వంటి వరుస బ్లాక్‌బస్టర్‌లతో తెలుగు నాట తేజ పేరు మారుమోగిపోయింది. ఆయనతో సినిమా చేసేందుకు స్టార్లు సైతం వెయిట్ చేసేవారు. మంచి ఊపు మీదున్న దశలో ఫ్లాప్‌లు పలకరించడంతో తేజ తెలుగు ప్రేక్షకులకు దూరమయ్యారు. ఇక తేజ పని అయిపోయింది అనుకున్న టైంలో ‘‘నేనే రాజు నేనే మంత్రి’’ సినిమాతో తనలో సత్తా ఏమాత్రం తగ్గలేదని నిరూపించారు. ఆ వెంటనే మళ్లీ తెలుగులో బిజీ అయ్యారు. బాలకృష్ణ హీరోగా ఆయన తండ్రి, దివంగత నందమూరి తారక రామారావు బయోపిక్‌ను తేజనే డైరెక్ట్ చేయాల్సి వుంది. కానీ అనుకోని కారణాల వల్ల తేజ తప్పుకుని క్రిష్‌కి ఛాన్స్ దక్కింది. తర్వాత కాజల్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌లతో తేజ తీసిన ‘‘సీత’’ పరాజయం పాలైంది.

దగ్గుబాటి అభిరామ్‌తో అహింస చేస్తున్న తేజ :

ఈ నేపథ్యంలో మరోసారి తన సత్తా చాటాలని ఆయన గట్టిగా ట్రై చేస్తున్నారు. దీనిలో భాగంగా దగ్గుబాటి సురేష్ బాబు కుమారుడు అభిరామ్ హీరోగా అహింస సినిమాను తెరకెక్కించారు. జూన్ 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. మూవీ ప్రమోషన్‌లో భాగంగా ఇటీవలి కాలంలో మీడియా, యూట్యూబ్ ఛానెళ్లకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు తేజ. ఈ క్రమంలో ఇండస్ట్రీలోని పరిస్థితులు, ఇతర అంశాలపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా ‘‘ https://indiaglitz.com/’’కు ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో తేజ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఆంధ్రా బ్యాంక్‌ను విలీనం చేస్తుంటే కనీసం అడ్డుకోలేదు :

ఆంధ్రావాళ్లకి సిగ్గులేదని.. ఆత్మాభిమానం లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనికి కారణం లేకపోలేదు. దేశంలోని కొన్ని బ్యాంక్‌లను ప్రధాని మోడీ ప్రభుత్వం ఇతర ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల్లో విలీనం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆంధ్రా బ్యాంక్‌ను యూనియన్ బ్యాంక్‌లో కలిపింది కేంద్ర ప్రభుత్వం. దీనిపై తేజ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పంజాబ్ బ్యాంక్ , కెనరా బ్యాంక్‌లను కదిలించని కేంద్రం.. ఆంధ్రా బ్యాంక్‌ను మాత్రం ఎంచక్కా విలీనం చేసుకుందని తేజ తెలిపారు. కారణం .. ఆంధ్రా వాళ్లకి మన అనే ఫీలింగ్ లేదని.. పోతే పోయింది మాకేంటి అనుకున్నారని , ఎవ్వరికీ సిగ్గులేదని ఆంధ్రా బ్యాంక్ విలీనాన్ని అడ్డుకోవడానికి కనీసం ప్రయత్నించలేదని తేజ చురకలంటించారు.

మ్యూజిక్ విషయంలో నేనొక ఇడియట్‌ని :

ఇక ఇదే ఇంటర్వ్యూలో సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్‌ను.. తెలుగువారి మధుర గాయకుడు , లెజెండరీ ఘంటసాలతో పోల్చినట్లుగా తాను గతంలో అన్నట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని తేజ ఖండించారు. సంగీత విషయంలో తానొక ఇడియట్‌ని అన్న ఆయన.. తనకు మ్యూజిక్ విషయంలో ఏ నాలెడ్జ్ లేదని స్పష్టం చేశారు. ఆర్పీ పట్నాయక్ పడతానంటే పాడమన్నానని.. తనకు నచ్చినట్లుగా , ఎమోషన్ వర్కవుట్ అయ్యేట్లుగా పాట వచ్చిందా లేదా అనేది తప్పించి మిగిలిన విషయాలు తనకు అనవసరమని తేజ స్పష్టం చేశారు. అలాగే ఘంటసాలతో ఆర్పీ పట్నాయక్‌ను పోల్చిన మాట అవాస్తవమని ఆయన పేర్కొన్నారు.

More News

ISRO : జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్12 ప్రయోగం విజయవంతం... ఈ శాటిలైట్ వల్ల ఉపయోగాలివే

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) వరుస విజయాలతో దూసుకుపోతోంది.

Sharwanand: శర్వానంద్‌‌‌కి యాక్సిడెంట్.. స్పందించిన శర్వా టీమ్

టాలీవుడ్ యువ కథానాయకుడు శర్వానంద్‌కు తృటిలో ప్రాణాపాయం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న రేంజ్ రోవర్ కారు శనివారం అర్రాత్రి హైదరాబాద్ ఫిల్మ్ నగర్ ‌లోని ఓ జంక్షన్ వద్ద అదుపు

Telangana: తెలంగాణకు అలర్ట్ .. వచ్చే మూడు రోజుల్లో మండిపోనున్న ఎండలు

రోహిణి కార్తె ప్రవేశంతో తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9 గంటలకే భానుడు మాడు పగుల గొడుతున్నాడు. అత్యవసర పనుల మీద బయటకు వెళ్లే వారు

Director Vasu: టాలీవుడ్‌లో మరో విషాదం.. దర్శకుడు కే.వాసు కన్నుమూత, మెగాస్టార్‌కు కోలుకోలేని షాక్

సంగీత దర్శకుడు రాజ్, సీనియర్ నటులు శరత్ బాబు మరణాల నుంచి కోలుకోకముందే టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ దర్శకుడు కే.వాసు కన్నుమూశారు.

చైనాలో మళ్లీ విజృంభిస్తోన్న కరోనా.. జూన్ చివరి నాటికి గరిష్ట స్థాయికి, వారానికి 6.5 కోట్ల కేసులు ..?

దాదాపు రెండున్నరేళ్ల పాటు మనిషిని నాలుగు గోడలకు పరిమితం చేసి అన్ని వ్యవస్థలను కకావికలం చేసింది కోవిడ్ రక్కసి. ఈ మహమ్మారి పీడ అంతం అయ్యిందని అనుకుంటుంటే