తేజ నెక్ట్స్ ప్రాజెక్ట్ అప్డేట్
Send us your feedback to audioarticles@vaarta.com
జయం తరువాత సరైన విజయం లేని దర్శకుడు తేజకు.. గతేడాది విడుదలైన నేనే రాజు నేనే మంత్రి ఆ లోటుని తీర్చేసింది. ఈ సినిమాతో మళ్ళీ ఫామ్‌లోకి వచ్చేసిన తేజకు రెండు పెద్ద ప్రాజెక్టులు సెటయ్యాయి. బాలకృష్ణతో యన్.టి.ఆర్ బయోపిక్, వెంకటేష్‌తో ఓ సినిమా చేసే అవకాశాలు వచ్చాయి. అయితే.. అనూహ్యంగా ఆ రెండు సినిమాల నుంచి తేజ బయటకు వచ్చారు.
తన గత చిత్ర కథానాయకుడు రానాతోనే 1971 ఇండో పాక్ వార్ నేపథ్యంలో ఓ సినిమా తీయబోతున్నట్లు వార్తలు వచ్చినా.. అవి కూడా వర్కవుట్ కాలేదు.
ఇదిలా ఉంటే.. తాజా సమాచారం ప్రకారం.. తేజ ఓ సినిమాకి కమిటయ్యాడని తెలిసింది. వేగ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుందన్నదే ఆ తాజా కబురు. ఈ సినిమాకి సంబంధించి కథానాయకుడు, ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments