ఆడిషన్స్ కోసం కొత్త పద్ధతిని అవలంబిస్తున్న తేజ
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న చిత్రం ఎన్టీఆర్`. నందమూరి బాలకృష్ణ టైటిల్ రోల్‌లో నటిస్తున్న ఈ చిత్రానికి తేజ దర్శకుడు. తాజాగా ఈ సినిమా చిత్రీకరణ కూడా ప్రారంభమైంది. ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో నటించడం కోసం చాలా మంది నటీమణుల నుంచి దరఖాస్తులు వచ్చాయి. వాటిని ఒక్కొక్కటిగా బసవతారకం ఫోటోతో అనుసంధానం చేసి చూడడం సాధ్యం కాకపోవడం వలన తేజ ఫేస్ రికగ్నేషన్ టెక్నాలజీని వాడుకోవడానికి సిద్ధమయ్యారు.
ఫేస్ రికగ్నేషన్ (ముఖ కవళికలను గుర్తుపట్టే) సాఫ్ట్ వేర్ ..అంటే ఒరిజినల్ ఫోటోని సాఫ్ట్ వేర్లో అప్ లోడ్ చేస్తే...ఆ ఫోటోలో ఉన్న ముఖాన్ని, ముఖ కవళికల్ని డిజిటల్ వీడియో కెమెరా సాయంతో డేటాబేస్ లో పొందుపరుచుకుంటుంది. ఆ తర్వాత.. వచ్చిన ఫొటోస్ ని సాఫ్ట్ వేర్లో అప్ లోడ్ చేస్తే...డేటాబేస్ లోనున్న ఒరిజినల్ ఫోటోతో సమన్వయం చేసుకుని దానితో సరితూగే లేదా దగ్గరగా ఉండే ఫోటోలను మాత్రమే ఈ సాఫ్ట్ వేర్ అవుట్ పుట్ రూపంలో ఇస్తుంది. దీని వలన ఎన్ని వేల ఫోటోలు, దరఖాస్తులు వచ్చినా.. తక్కువ టైంలో మనకి కావాల్సిన అవుట్ పుట్ ని సాధించుకోవచ్చు. తేజ ఈ టెక్నాలజీ సాయంతో బసవతారకం ఫోటోతో సరితూగే ఫొటోలో ఉన్న వ్యక్తుల పేర్లు తీసుకుని.. వాళ్ళని మాత్రమే ఆడిషన్స్ కోసం పిలుస్తున్నారు. ప్రస్తుతం ఈ ఆడిషన్స్ ప్రాసెస్ జరుగుతోందని చిత్ర వర్గాలు పేర్కొంటున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com