డిజిటల్ మాధ్యమంలోకి తేజ..!

  • IndiaGlitz, [Monday,April 27 2020]

డైరెక్టర్ తేజ త్వరలోనే డిజిటల్ మీడియంలోకి అడుగు పెట్టబోతున్నారు. సినీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు ప్రముఖ డిజిట‌ల్ మీడియం సంస్థ అమెజాన్ ప్రైమ్ చ‌ర్చ‌లు జ‌రిపింద‌ట‌. రెండు సినిమాలు, మూడు వెబ్ సిరీస్‌లు రూపొందించేలా అమెజాన్ సంస్థ తేజ‌తో చ‌ర్చ‌లు జ‌రిపింద‌ట‌. బోల్డ్ కంటెంట్‌తో ప్రేక్ష‌కుల ముందుకు వెబ్ సిరీస్‌ల‌ను రూపొందించే ఈ సంస్థ‌లో తేజ ఎలాంటి బోల్డ్ కంటెంట్‌తో సినిమా చేస్తాడో వేచి చూడాలి.

డైరెక్ట‌ర్ తేజ ఒక‌ప్పుడు చిత్రం, నువ్వు నేను, జ‌యం వంటి ప్రేమ‌క‌థా చిత్రాల‌తో వ‌రుస విజయాల‌ను అందుకున్నాడు. ల‌వ్‌స్టోరీస్‌ను తెర‌కెక్కించ‌డంలో దిట్ట‌గా పేరు సంపాదించుకున్నాడు. అయితే ఆ త‌ర్వాత స‌క్సెస్‌ల‌ను సాధించ‌డంలో వెనుక‌బ‌డ్డాడు. ఇక తేజ అనే డైరెక్ట‌ర్ లేడేమో అని అనుకుంటున్న స‌మ‌యంలో 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాతో స‌క్సెస్ సాధించి మ‌ళ్లీ త‌న ఉనికిని చాటుకున్నాడు. సీనియ‌ర్ ఎన్టీఆర్ బ‌యోపిక్ 'య‌న్‌.టి.ఆర్‌'ను తెర‌కెక్కించాల్సింది కానీ.. ఆ ప్రాజెక్ట్ నుండి త‌ప్పుకున్నాడు. కానీ త‌ర్వాత తేజ తెర‌కెక్కించిన 'సీత‌' బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్ అయ్యింది. ఈయ‌న త‌దుప‌రి సినిమాల‌పై ప‌లు వార్త‌లు వ‌చ్చాయి. సినిమా విష‌యానికి వ‌స్తే గోపీచంద్‌తో ఓ సినిమా, రానాతో ఓ సినిమాను తెరకెక్కించే ప్ర‌ణాళిక‌లు వేస్తున్నాడు తేజ‌.

More News

ముచ్చ‌ట‌గా మూడోసారి ..!

కొన్ని హిట్ పెయిర్(హీరో హీరోయిన్‌)ను చూడ‌టానికి ప్రేక్ష‌కులు ఆస‌క్తిని చూపుతుంటారు. అలాంటి హిట్ పెయిర్స్‌లో నేటి త‌రంలో రాజ్‌త‌రుణ్‌, అవికాగోర్ జోడీ ఒక‌టి.

బాల‌య్య సినిమాలో కుర్ర హీరో కీల‌క పాత్ర‌..!

నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా న‌టిస్తోన్న 106 చిత్రం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తెర‌కెక్కుతోంది. తొలి షెడ్యూల్ పూర్త‌యిన ఈ సినిమా క‌రోనా

మెగా హీరో సినిమాలో ఉపేంద్ర

గత ఏడాది `ఎఫ్ 2`, `గ‌ద్ద‌ల కొండ గ‌ణేష్` చిత్రాల‌తో వ‌రుస విజ‌యాల‌ను త‌న ఖాతాలో వేసుకున్న యువ హీరో వ‌రుణ్ తేజ్‌. డిప‌రెంట్ సినిమాలు చేయ‌డానికి

కరోనా కేసుల్లో ఏపీలో అలా.. తెలంగాణలో ఇలా.. ఏం జరుగుతోంది!?

కరోనా మహమ్మారి తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కేసుల సంఖ్య వెయ్యి దాటిపోయింది. అయితే ఏపీలో మాత్రం డబుల్ డిజిట్‌లో ఉదాహరణకు

హీరో సూర్యకు ప్రొడ్యూస‌ర్స్ స‌పోర్ట్

హీరో సూర్య సినిమాల్లో క‌థానాయ‌కుడిగా న‌టించ‌డ‌మే కాకుండా త‌న స్వంత బ్యాన‌ర్ 2డీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌పై భార్య జ్యోతిక స‌హా ఇత‌ర న‌టీన‌టుల‌తో చిన్న బ‌డ్జెట్ చిత్రాల‌ను నిర్మిస్తుంటారు