Surya Kiran: చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం.. ప్రముఖ దర్శకుడు సూర్యకిరణ్ కన్నుమూత

  • IndiaGlitz, [Monday,March 11 2024]

తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమల్లో తీవ్ర విషాదం నెలకొంది. సీనియర్ నటి కల్యాణి భర్త, దర్శకుడు సూర్యకిరణ్ కన్నుమూశారు. కొంత కాలంగా పచ్చ కామెర్లతో బాధపడుతున్న ఆయనకు సోమవారం ఉదయం గుండెపోటు వచ్చి తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది. మంగళవారం చెన్నైలో అంత్య క్రియలు జరుగనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.ఆయన మృతి పట్ల కోలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. తెలుగు ప్రేక్షకులకు ఆయన నటుడిగా, దర్శకుడిగా సుపరిచితం. సత్యం, ధన 51, రాజు భాయ్ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

కేరళకి చెందిన సూర్య కిరణ్‌ మలయాళ సినిమాలతో కెరీర్‌ని ప్రారంభించారు. 1978లో 'స్నేహిక్కన్‌ ఓరు పెన్ను' అనే చిత్రంలో బాలనటుడిగా నటించారు. అనంతరం మలయాళంతో పాటు కన్నడ, తమిళంలోకి ఎంట్రీ ఇచ్చారు. తెలుగులోనూ 1986లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన 'రాక్షసుడు' మూవీతో ఎంట్రీ ఇచ్చారు. 'దొంగమొగుడు', 'సంకీర్తన', 'ఖైదీ నెం 786', 'కొండవీటి దొంగ' వంటి చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌, అమితాబ్‌ వంటి బిగ్‌ స్టార్ట్స్‌తో నటించి మెప్పించారు. మాస్టర్ సురేష్ పేరుతో బాలనటుడిగా తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం వంటి దక్షిణ భాషలలో 200 చిత్రాలకు పైగా నటించి ఓ రికార్డ్ క్రియేట్ చేశారు.

అంతే కాకుండా బాలనటుడిగా రెండు కేంద్ర ప్రభుత్వ అవార్డులు, దర్శకుడిగా రెండు నంది అవార్డులు అందుకున్నారు. ఇక 2003లో 'సత్యం' సినిమాతో దర్శకుడిగా మారారు. అక్కినేని వారసుడు సుమంత్‌ హీరోగా నటించిన ఈ మూవీలో జెనీలియా హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం పెద్ద విజయం సాధించి సూర్యకిరణ్‌కు మంచి పేరు తెచ్చి పెట్టింది. ఆ తర్వాత సుమంత్‌తోనే 'ధన 51' చిత్రం చేశారు. ఇక జగపతిబాబుతో 'బ్రహ్మాస్త్రం'.. మంచు మనోజ్‌తో 'రాజు భాయ్' చిత్రాలకు దర్శకత్వం వహించారు. తమిళంలో వరలక్ష్మి శరత్ కుమార్ నటించిన 'అరసి' చిత్రాన్ని కూడా డైరెక్ట్ చేశారు.

దర్శకుడిగా కొనసాగుతున్న సమయంలోనే హీరోయిన్‌ కళ్యాణిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొంత కాలం తర్వాత అభిప్రాయభేదాలతో ఇద్దరు విడిపోయారు. సూర్య కిరణ్‌ తెలుగు బిగ్‌ బాస్‌ షోలో పాల్గొన్నారు. బిగ్‌ బాస్‌ 4వ సీజన్‌లో కంటెస్టెంట్‌గా సందడి చేశారు. కానీ తొలి వారంలోనే ఎలిమినేట్‌ అయ్యారు. చివరగా 'ఛాప్టర్ 6' అనే సినిమాకు దర్శకత్వం వహించారు. సూర్యకిరణ్ మృతి పట్ల ప్రముఖులతో పాటు అభిమానులు తమ సంతాపం తెలియజేస్తున్నారు.

More News

Mudragada: జగన్‌ను మరోసారి సీఎంగా చేసుకుందాం.. ప్రజలకు ముద్రగడ బహిరంగ లేఖ..

జగన్ మోహన్ రెడ్డిని మరోసారి ఏపీ సీఎంగా చేసుకుందామంటూ రాష్ట్ర ప్రజలకు ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ రాశారు. ఈనెల 14న సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతున్నానని ప్రకటించారు.

Naatu Naatu: ఆస్కార్ వేదికపై మరోసారి 'నాటునాటు' పాట.. నగ్నంగా స్టేజ్ పైకి వచ్చిన నటుడు..

ఆస్కార్ అవార్డ్స్ వేడుక అమెరికాలో గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకలో మన తెలుగు పాట మరోసారి అలరించింది. గతేడాది RRR మూవీలోని 'నాటు నాటు' పాటకు బెస్ట్ ఒరిజనల్ సాంగ్ అవార్డు

Oscars 2024: ఘనంగా ఆస్కార్-24 అవార్డ్స్‌.. సత్తా చాటిన ‘ఓపెన్‌హైమర్’

ప్రపంచ సినీ పరిశ్రమ ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డ్స్-2024 విజేతల పేర్లను అకాడమీ ప్రకటించింది. ప్రతిష్ఠాత్మక 96వ ఆస్కార్ అవార్డుల ప్రధాన కార్యక్రమం

15లక్షల మందితో 'సిద్ధం' సభ సూపర్ సక్సెస్.. ప్రతిపక్ష నేతల గుండెల్లో రైళ్లు..

అద్దంకి నియోజకవర్గం మేదరమెట్లలో నిర్వహించిన సిద్ధం సభ సూపర్ సక్సెస్ అయింది. సీఎం జగన్‌ కోసం జనం తండోపతండాలుగా తరలివచ్చారు.

TDP: ఎన్టీఏలో చేరిన టీడీపీ.. అధికారికంగా ప్రకటించిన బీజేపీ..

NDAలో తెలుగుదేశం పార్టీ చేరినట్లు అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంయుక్త ప్రకటన విడుదల చేశారు.