తమన్నా ఫైర్ అవ్వడంతో హీరోయిన్లందరికీ సారీ చెప్పిన డైరెక్టర్..!
Send us your feedback to audioarticles@vaarta.com
విశాల్ - తమన్నా జంటగా సురాజ్ తెరకెక్కించిన చిత్రం ఒక్కడొచ్చాడు. ఈ చిత్రం ప్రమోషన్లో భాగంగా ఇచ్చిన ఇంటర్ వ్యూలో డైరెక్టర్ సురాజ్ హీరోయిన్స్ గురించి చేసిన వ్యాఖ్యలు వివాదస్పమైన విషయం తెలిసిందే. సురాజ్ వ్యాఖ్యల పై ఫస్ట్ నయనతార ఫైర్ అయ్యింది. ఆతర్వాత తమన్నా స్పందిస్తూ...సురాజ్ హీరోయిన్స్ గురించి ఈవిధంగా మాట్లాడడం బాధాకరం.
ఒక్క నాకే కాకుండా ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్స్ అందరికీ డైరెక్టర్ సురాజ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. ఈ విషయం పై సురాజ్ స్పందిస్తూ...హీరోయిన్ల గురించి నేను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాను. తమన్నాతో పాటు మిగిలిన హీరోయిన్స్ అందరికీ క్షమాపణ చెబుతున్నా. హీరోయిన్ల గురించి తప్పుగా మాట్లాడి వారి మనసును బాధపెట్టాలి అనే ఆలోచన లేదు. మరోసారి హీరోయిన్స్ కు సారీ చెబుతున్నాను అని ప్రకటన ద్వారా తెలియచేసారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments