అదేం లేదంటున్న దర్శకుడు...

  • IndiaGlitz, [Wednesday,December 09 2015]

నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా న‌టించిన చిత్రం డిక్టేట‌ర్. అంజలి, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్‌. సంక్రాంతి కానుక‌గా సినిమా జ‌న‌వ‌రి 14న విడుద‌ల‌వుతుంది. అయితే ఈ సినిమాను బాలీవుడ్లో అజ‌య్‌దేవ‌గ‌ణ్ హీరోగా రీమేక్ చేస్తార‌ని వార్త‌లు విన‌ప‌డ్డాయి. బాలీవుడ్ రీమేక్‌కు శ్రీవాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించే అవ‌కాశాలున్నాయ‌నే టాక్ కూడా వినిపించింది. అయితే అలాంటిదేం లేద‌ని ద‌ర్శ‌కుడు శ్రీవాస్ అంటున్నాడు. సినిమా నిర్మాణ సంస్థ‌ల్లో ఈరోస్ సంస్థ భాగ‌స్వామిగా ఉండ‌టం వ‌ల్ల ఇలాంటి రూమ‌ర్స్ వ‌చ్చాయని, అయితే ఇప్పుడు వ‌స్తున్న వార్త‌ల్లో నిజం లేద‌ని ఆయ‌న ఈ సంద‌ర్భంగా తెలియ‌జేశారు.