అందర్నీ ఆకట్టుకునే ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ బ్రూస్ లీ : డైరెక్టర్ శ్రీను వైట్ల
Send us your feedback to audioarticles@vaarta.com
రామ్ చరణ్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం బ్రూస్ లీ. ఈ చిత్రాన్ని డి.వి.వి ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మించారు. చాలా కాలం తర్వాత మెగాస్టార్ ఈ చిత్రంలో నటిస్తుండడంతో బ్రూస్ లీ చిత్రం పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దసరా కానుకగా ఈనెల 16న బ్రూస్ లీ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా బ్రూస్ లీ గురించి డైరెక్టర్ శ్రీను వైట్ల ఇంటర్ వ్యూ మీకోసం...
ఆగడు ఫెయిల్యూర్ తర్వాత తీసిన బ్రూస్ లీ ఎలా ఉండబోతుంది..?
ఆగడు ఫెయిల్యూర్ నుంచి చాలా నేర్చుకున్నాను. ఈ సినిమా విషయంలో చేసిన తప్పులను తెలుసుకుని..వాటిని మళ్లీ చేయకుండా బ్రూస్ లీ సినిమా చేసాను. కథని చెప్పడంలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి కథని ఎంటర్ టైనింగ్ గా చెప్పడం, రెండు ఎంటర్ టైన్మెంట్ కోసం కథను చెప్పడం. ఈ రెండు పద్దతులతో సినిమాలు తీసాను. విజయం సాధించాను. ఇక బ్రూస్ లీ ఎలా ఉండబోతుంది అంటే..కథను ఎంటర్ టైనింగ్ గా చెప్పాలని తీసిన సినిమా బ్రూస్ లీ. ఖచ్చితంగా అందర్నీ ఆకట్టుకుంటుంది.
బ్రూస్ లీ కథేమిటి..?
ఇది ఒక ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్.ఇందులో యాక్షన్, ఎంటర్ టైన్మెంట్, రొమాన్స్...ఇలా ప్రేక్షకుల కోరుకునే అన్ని అంశాలు ఉంటాయి. ఫ్యామిలీని విపరీతంగా ప్రేమించే కుర్రాడుకి ఓ పెద్ద సమస్య వస్తుంది. ఆ సమస్య తో ఎలా పొరాడాడు..? ఆ సమస్య నుంచి ఎలా బయటపడ్డాడు..? అనేది బ్రూస్ లీ కథ.
మీ సినిమాల్లో ఎంటర్ టైన్మెంట్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో.. ఫ్యామిలీ ఎమోషన్స్ కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తారు. దీనికి ప్రత్యేక కారణం ఏమైనా ఉందా..?
నిజమే..మీరన్నట్టు నా సినిమాల్లో ఎంటర్ టైన్మెంట్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తానో...ఫ్యామిలీ ఎమోషన్స్ కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తాను. అయితే ఆగడు సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్ అనేది మిస్ అయ్యింది. అందుకే ఈసారి ఫ్యామిలీ ఎమోషన్ అనేది మిస్ కాలేదు.
మీ సినిమాలు అన్నీ ఒకే ఫార్మెట్ లో ఉంటున్నాయి. బ్రూస్ లీ కూడా మీ రెగ్యులర్ ఫార్మెట్ లోనే ఉంటుందా..?
ఈమధ్య నేను తీసిన సినిమాలు ఇంచుమించు ఒకే ఫార్మెట్ లో ఉన్నాయి. ఆ తర్వాత అదే ఫార్మెట్ లో చాలా సినిమాలు వచ్చాయి. అయితే నా నుంచి ఎంటర్ టైన్మెంట్ ఎక్స్ పెక్ట్ చేస్తారు కాబట్టి బ్రూస్ లీ సినిమాలో కూడా ఎంటర్ టైన్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే బ్రూస్ లీ చిత్రం రెగ్యులర్ ఫార్మెట్ లో కాకుండా ఓ కొత్త ఫార్మెట్ లో ఉంటుంది.
చరణ్ తో ఫస్ట్ టైం వర్క్ చేసారు కదా..? ఎలా అనిపించింది..?
నేను ఎవరితోనైనా సినిమా చేయాలంటే రెమ్యూనరేషన్ కన్నా...ఫ్రీడమ్ కోరుకుంటాను. ఒక సినిమా ఫ్లాప్ అయిన తర్వాత ఫ్రీడమ్ దొరకడం అనేది కష్టం.కానీ ఈ సినిమా విషయంలో నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. ఈ సందర్భంగా చిరంజీవి గార్కి, చరణ్ కి థ్యాంక్స్ చెబుతున్నాను.ఇక చరణ్ విషయానికి వస్తే...సెట్ లో చాలా సరదాగా ఉంటాడు. మంచి సెన్సాఫ్ హుమర్ ఉంది. నాకు కూడా సరదాగా ఉండే వాళ్ళు అంటే ఇష్టం. అందుకే ఇద్దరం బాగా కనెక్ట్ అయ్యాం.
చరణ్ లో మీకు నచ్చేవి ఏమిటి..?
చరణ్ డాన్స్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే డాన్స్ అందరు చేస్తారు..కానీ చరణ్ డాన్స్ లో గ్రేస్ ఉంటుంది. అది చాలా ఇష్టం. అలాగే చరణ్ వాయిస్ ఇష్టం. చరణ్ హెయిర్ స్టైల్ అంటే ఇంకా ఇష్టం. అందుకనే చిరుత సినిమా టైంలో ఉన్న లుక్...హెయిర్ స్టైల్ కావాలని చరణ్ ని బ్రూస్ లీ లో అలా కొత్తగా చూపించాను.
బ్రూస్ లీ లో చిరంజీవి గారి క్యారెక్టర్ ఎలా ఉంటుంది...?
చిరంజీవి గారి పాత్ర కథకనుగుణంగానే ఉంటుంది తప్ప ఏదో కావాలని పెట్టినట్టు ఉండదు.అలాగే కథ నచ్చే చిరంజీవి గారు బ్రూస్ లీ లో నటించారు. చిరంజీవి గార్ని సెట్ లో చూసినప్పుడు గ్యాంగ్ లీడర్ లో చిరంజీవి గార్ని చూసిన ఫీల్ కలిగింది. అందరివాడు సినిమాలో చిరంజీవిగార్ని డైరెక్ట్ చేసినప్పుడు కన్నా...ఇప్పుడు ఎక్కువ ఎగ్జైట్ అయ్యాను.
బ్రూస్ లీ లో హైలెట్ ఏమిటి..?
చిరంజీవి గారి క్యారెక్టర్, కథ, ఇంటర్వెల్ ఎపిసోడ్ ఈ చిత్రానికి హైలెట్ గా నిలుస్తాయి.
కోన వెంకట్ తో మళ్లీ కలసి వర్క్ చేసారు కదా..? కోన తో వర్క్ చేయడం కంటిన్యూ చేస్తారా..?
కోన వెంకట్ తో కలసి చాలా సినిమాలు చేసాను. అయితే మా మధ్య చిన్న ప్రాబ్లమ్ రావడం వలన కొన్ని రోజులు దూరంగా ఉన్నా..మళ్లీ కలసి బ్రూస్ లీ కి వర్క్ చేసాం. ఇక నుంచి కంటిన్యూగా కలసి వర్క్ చేస్తాం.
ఆనందం సినిమా నుంచి ఇప్పటి వరకు మీ సినిమాల్లోతాగుడు సీన్ ఉంటుంది కదా..మరి బ్రూస్ లీ లో కూడా ఉంటుందా..?
బ్రూస్ లీ లో కూడా అలాంటి సీన్ ఉంటుంది. కాకపోతే రెగ్యులర్ గా చూపించేంత స్థాయిలో కాకుండా కొంచెం తక్కువుగా ఉంటుంది.
మీ సినిమా అంటే కామెడీ బాగా ఎక్స్ పెక్ట్ చేస్తారు. ఇందులో కామెడీ ఎలా ఉంటుంది..?
ఈ సినిమాలో బ్రహ్మానందం గారి పాత్ర మంచి ఎంటర్ టైనింగ్ గా ఉంటుంది. అలాగే జయప్రకాష్ రెడ్డి గారి పాత్ర కూడా చాలా హైలైట్ గా ఉంటుంది. ఈ వయసులో కూడా ఆయన చాలా కష్టపడి చేసారు. ఖచ్చితంగా ఆడియోన్స్ ఎంజాయ్ చేస్తారు.
నెక్ట్స్ ప్రాజెక్ట్స్ గురించి..?
రెండు కొత్త కథలను రెడీ చేస్తున్నాను.ఈ రెండు కథలు నా కెరీర్ కు ఉపయోగపడేలా ఉంటాయి.త్వరలోనే వివరాలు తెలియచేస్తాను.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com