ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుకు కరోనా పాజిటివ్
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కరోనా బారినపడ్డారు. సెప్టెంబర్ 9న ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం హోం క్వారంటైన్లో ఉన్నానని వెల్లడిస్తూ సింగీతం శ్రీనివాసరావు ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారు. ‘‘నేను చాలా మెసేజ్‌లతో పాటు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ముఖ్యంగా విలేకరుల నుంచి కాల్స్ వస్తున్నాయి. ఈనెల 21న నా పుట్టినరోజును పురస్కరించుకుని ఈ కాల్స్ చేస్తున్నారు. అయితే నేను ఈ వేడుకలకు హాజరు కాలేకపోతున్నా. ఎందుకంటే ఈ నెల 9న నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
65 ఏళ్ల వయసులో నాకు పాజిటివ్. నేనెప్పుడూ నెగెటివ్‌గా ఉండలేదు(నవ్వుతూ).. నేనెప్పుడూ పాజిటివ్‌గానే ఉన్నాను. ఏదైతేనేమి వైద్యులు నాకు కరోనా పాజిటివ్‌గా డిక్లేర్ చేశారు. నాకు పెద్దగా లక్షణాలేమీ లేకపోవడంతో నేను హోం ఐసోలేషన్‌లో ఉన్నాను. నాకు సెపరేట్ రూం.. అన్నీ సెపరేట్‌గానే ఉన్నాయి. నాకు ఫుడ్ అందిస్తారు. నాకు నా హాస్టల్ డేస్ గుర్తొస్తున్నాయి. ఈ నెల 22తో రెండు వారాల గడువు ముగుస్తుంది. నేను నా పుస్తకాలతో కాలయాపన చేస్తున్నాను.
నన్ను కలవాలని ప్రయత్నించే వారికి.. నా పుట్టినరోజు నిర్వహించాలనుకునే వారందరికీ థాంక్యూ వెరీ మచ్. సీటీ స్కానర్ దాని పని అది చేస్తోంది. మెడిసిన్స్ వాటి పని అవి చేస్తున్నాయి. కానీ మనమెందుకు మన పని చెయ్యట్లేదు? నేను నా పని చేస్తున్నాను. ఈ సమయంలో నా స్క్రిప్ట్ నేను సిద్ధం చేసుకుంటున్నాను. కరోనా మహమ్మారి అనేది చాలా సీరియస్ విషయం. ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. నాకు కరోనా ఎలా సోకిందో తెలియదు. నేను 23న బయటకు వస్తాను’’ అని సింగీతం శ్రీనివాసరావు వెల్లడించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments