కరోనాకు చెక్ పెట్టిన ‘లవ్ స్టోరీ’.. ఇన్‌స్పైరింగ్..
Send us your feedback to audioarticles@vaarta.com
శేఖర్ కమ్ముల దర్వకత్వంలో అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా తెరకెక్కిన చిత్రం ‘లవ్ స్టోరీ’. ఈ చిత్రం షూటింగ్ సమయంలో శేఖర్ కమ్ముల తీసుకున్న జాగ్రత్తలు ఒక్కరినంటే ఒక్కరిని కూడా కరోనా బారిన పడకుండా చేశాయి. అసలు ఆయనేం జాగ్రత్తలు తీసుకున్నారు. ఎలా కరోనా బారిన పడకుండా తన సినిమా షూటింగ్‌ను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశారనే ఇన్‌స్పైరింగ్ స్టోరీ మీకోసం..
వీలైన అన్ని జాగ్రత్తల ద్వారా కరోనా వ్యాప్తిని విజయవంతంగా అడ్డుకుంది ‘లవ్ స్టోరి’ సినిమా టీమ్. దర్శకుడు శేఖర్ కమ్ముల ముందు చూపు దాదాపు వందమంది యూనిట్ మెంబర్స్‌ను కరోనా బారిన పడకుండా చేసింది. లాక్ డౌన్ తర్వాత ‘లవ్ స్టోరి’ సినిమా షూటింగ్ ఆగస్టులో మొదలైంది. సగం మంది యూనిట్‌తోనే షూటింగ్‌లకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. దాదాపు 200 మంది ఉండాల్సిన యూనిట్ 100 మందితోనే సర్దుకుపోవాల్సి వచ్చింది. టీమ్‌లో ఒకరికి కరోనా వచ్చినా అందరికీ ప్రమాదమే. ఈ ప్రమాదాన్ని అడ్డుకునేందుకు శేఖర్ కమ్ముల పక్కా ప్రణాళిక అనుసరించారు. ముందుగా సెట్ మొత్తం శానిటైజ్ చేసేవారు. ఆ తర్వాత సెట్‌లోకి అడుగుపెట్టే ముందే ప్రతి ఒక్క యూనిట్ సభ్యుడిని శానిటైజ్ చేసేవారు.
షూటింగ్‌లో పాల్గొనే ప్రతి ఒక్కరికి రెండు రోజుల ముందే ఆర్టీపీసీఆర్ విధానంలో కరోనా టెస్టులు నిర్వహించేవారు. ఫలితం నెగిటివ్ వస్తేనే చిత్రీకరణకు అనుమతించారు. చాలా మంది సినిమా యూనిట్స్ యాంటీజన్ పరీక్షలు నిర్వహించాయి. వీటిలో ఫలితం నిర్థారణలో 50 శాతం వరకే ఖచ్చితత్వం ఉంటుంది. ఆర్టీపీసీఆర్‌తో పూర్తి ఫలితం తెలుస్తుంది. యూనిట్ అందరికీ ఆర్టీపీసీఆర్, శానిటైజ్, మాస్కులతో పాటు ఫేస్ షీల్డ్‌లు కూడా ఇచ్చారు. కరోనా వ్యాప్తి కాకుండా జాగ్రత్త పడటంతో పాటు పౌష్టికాహారాన్ని లవ్ స్టోరి సెట్‌లో అందించేవారు. ప్రతి రోజూ గుడ్లు, పాలు, పండ్లు అందజేశారు. అలాగే ప్రతి 15 రోజులకు ఒకసారి మల్టీ విటమిన్ టాబ్లెట్లు ఇచ్చారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే బౌన్సర్లతో సహా మొత్తం 24 క్రాఫ్టులలోని యూనిట్ మెంబర్స్ 95 మందికి కొవిడ్ ఇన్యూరెన్స్ చేయించారు. 3 లక్షల రూపాయల కవరేజ్ ఉండే ఈ ఆరోగ్య బీమా కేవలం కొవిడ్ కోసమే. ఆస్పత్రిలో చేరి చికిత్స పొందితే ఖర్చంతా రీయింబర్స్ మెంట్ చేసుకోవచ్చు.
మన ప్రయత్నం బాగుంటే టైమ్ కూడా కలిసి వస్తుందని అన్నట్లు లవ్ స్టోరి సినిమా షూటింగ్ మొత్తంలో ఏ ఒక్కరికీ కొవిడ్ రాలేదు. ఈ ఇన్యూరెన్స్ ఉపయోగించుకునే పరిస్థితి రాలేదు. కానీ షూటింగ్ జరిగినన్ని రోజులు చిత్ర బృందం అంతా ధైర్యంగా పనిచేశారు. ఏదైనా అయితే ఇన్సూరెన్స్ ఉందనే విషయం వారికి ఎంతో కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఈ బీమా ఈ ఏడాది సెప్టెంబర్ వరకు కొనసాగనుంది. శానిటైజ్, మాస్కులు, ఫేస్ షీల్డ్స్, హెల్దీ ఫుడ్, మల్టీ విటమిన్ టాబ్లెట్స్, ఆర్టీపీసీఆర్ టెస్టులు, హెల్త్ ఇన్స్యూరెన్స్ ఇవన్నీ కలిసి 50 లక్షల రూపాయల దాకా లవ్ స్టోరి నిర్మాతలు భరించారు. మనిషి ప్రాణం కంటే డబ్బు ముఖ్యం కాదన్నది వారి ఆలోచన. హడావుడిగా సినిమా షూటింగ్‌లు చేసి, ఎవరో ఒకరు వైరస్ బారిన పడగానే మొత్తం షూటింగ్ ఆపేసే చిత్ర బృందాలకు లవ్ స్టోరి సినిమా టీమ్ తీసుకున్న జాగ్రత్తలు, చేసిన ప్రయత్నం... ప్రశంసనీయం, అనుసరనీయం, స్పూర్తివంతం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout