ఆ వార్త మనోవేదనకు గురి చేసింది: డైరెక్టర్ ఎస్.శంకర్
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన చిత్రం ‘యందిరన్’ (రోబో) కథ విషయంలో స్టార్ డైరెక్టర్ ఎస్. శంకర్‌పై ఒక అసత్య ప్రచారం జరిగింది. ఆయన రోబో కథ విషయంలో చెన్నై ఎగ్మోర్ క్రైం కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసినట్టు వార్తలు వచ్చాయి. తాజాగా శంకర్ ఆ వార్తలపై వివరణ ఇస్తూ ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ వార్తలు తమను తీవ్ర దిగ్ర్భాంతికి గురిచేశాయని శంకర్ వెల్లడించారు. ఇదే విషయంపై తన న్యాయవాది సాయికుమార్‌తో కలిసి చెన్నై ఎగ్మోర్ కోర్టు మేజిస్ట్రేట్‌ను సంప్రదిస్తే, ఎలాంటి వారెంట్ జారీచేయలేదన్నారు.
కోర్టు ఆన్‌లైన్ వ్యవహారాల్లో తప్పిదం కారణంగా వారెంట్ అంటూ ప్రచారం జరిగి ఉండొచ్చని శంకర్ పేర్కొన్నారు. ఇపుడు ఆ పొరబాటును సరిదిద్దుతున్నట్టు తమకు చెప్పారన్నారు. అంతేకాకుండా, ఇలాంటి వార్తలను ఎలాంటి నిర్థారణ చేయకుండా ప్రచురించడం తమను విస్మయానికి గురిచేసిందని శంకర్ వెల్లడించారు. ముఖ్యంగా ఈ వార్త వల్ల తన కుటుంబ సభ్యులతో పాటు శ్రేయోభిలాషులు అనవసరంగా మనోవేదనకు గురయ్యారని శంకర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
కాగా.. రోబో సినిమా విషయంలో ప్రముఖ దర్శకుడు శంకర్‌కు కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసిందని వార్తలొచ్చాయి. అరూర్ తమిళ్‌నాడన్ అనే వ్యక్తి తను రాసిన 'జిగుబా' కథను కాపీ చేసి 'ఎంథిరన్'గా తీశారంటూ దర్శకుడిపై సంచలన ఆరోపణలు చేశారు. తనకు న్యాయం జరగాలంటూ కొన్నేళ్ల క్రితం కోర్టుకెక్కాడు. అయితే సంవత్సరాలు గడిచిపోతున్నా శంకర్ కోర్టుకు హాజరు కాలేదని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఎగ్మోర్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ రెండో కోర్టు అతడికి నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసిందని వార్తలొచ్చాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments