సీక్వెల ప్లాన్ లో శంకర్...
Send us your feedback to audioarticles@vaarta.com
'జెంటిల్‌మేన్', 'భారతీయుడు' నుండి విడుదల కాబోతున్న '2.0' వరకు ఎన్నో విభిన్నమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు శంకర్. దర్శకత్వమే కాదు సినిమా నిర్మాణ రంగంలో కూడా శంకర్‌కు మక్కువ ఎక్కువే. తన అభిరుచి మేరకు చిన్న బడ్జెట్ చిత్రాలను తమిళంలో నిర్మిస్తుంటారాయన. అలా శంకర్ నిర్మాతగా రూపొందిన చిత్రాల్లో తమిళ హాస్యనటుడు వడివేలు టైటిల్ పాత్రలో నటించిన చిత్రం '23వ పులకేశి'.
పూర్తి స్థాయి కామెడి చిత్రంగా రూపొందిన ఈ సినిమా తమిళంలోనే కాదు, తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకుంది. శింబుదేవన్ దర్శకుడు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రూపొందనుంది. ఈ విషయాన్ని దర్శకుడు శంకర్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియజేశారు. '23వ పులకేశి' చిత్రానికి 11 సంవత్సరాలు పూర్తయ్యాయి. త్వరలోనే ఈ చిత్రానికి సీక్వెల్ చేస్తామంటూ సినిమాకు సంబంధించిన ఓ కార్టూన్‌ను కూడా పోస్ట్ చేశాడు శంకర్. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి చేయనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com