సీక్వెల ప్లాన్ లో శంకర్...

  • IndiaGlitz, [Monday,July 10 2017]

'జెంటిల్‌మేన్‌', 'భారతీయుడు' నుండి విడుదల కాబోతున్న '2.0' వరకు ఎన్నో విభిన్నమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు శంకర్‌. దర్శకత్వమే కాదు సినిమా నిర్మాణ రంగంలో కూడా శంకర్‌కు మక్కువ ఎక్కువే. తన అభిరుచి మేరకు చిన్న బడ్జెట్‌ చిత్రాలను తమిళంలో నిర్మిస్తుంటారాయన. అలా శంకర్‌ నిర్మాతగా రూపొందిన చిత్రాల్లో తమిళ హాస్యనటుడు వడివేలు టైటిల్‌ పాత్రలో నటించిన చిత్రం '23వ పులకేశి'.

పూర్తి స్థాయి కామెడి చిత్రంగా రూపొందిన ఈ సినిమా తమిళంలోనే కాదు, తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకుంది. శింబుదేవన్‌ దర్శకుడు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌ రూపొందనుంది. ఈ విషయాన్ని దర్శకుడు శంకర్‌ తన ట్విట్టర్‌ అకౌంట్‌ ద్వారా తెలియజేశారు. '23వ పులకేశి' చిత్రానికి 11 సంవత్సరాలు పూర్తయ్యాయి. త్వరలోనే ఈ చిత్రానికి సీక్వెల్‌ చేస్తామంటూ సినిమాకు సంబంధించిన ఓ కార్టూన్‌ను కూడా పోస్ట్‌ చేశాడు శంకర్‌. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి చేయనున్నారు.

More News

విక్రమ్ సరసన కమల్ తనయ?

కమల్హాసన్ ఇంట్లో కళామతల్లి కొలువై ఉంటుందని అంటారు.

రాధిక భర్తకు దూరంగా ఉంటోందా?

కన్నడ నటి రాధిక తన భర్త కుమారస్వామికి దూరంగా ఉంటోందా?.. అవుననే పలువురు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిని రాధిక 2006లో పెళ్లి చేసుకున్నట్టు ప్రకటించారు.

సురేందర్ రెడ్డి కొత్త వ్యాపారం

సురేందర్రెడ్డి పేరు వినగానే టాలీవుడ్ స్టైలిష్ డైరక్టర్ అనే మాట గుర్తుకొచ్చేస్తుంది. ఆయన తెరకెక్కించే సినిమాల్లో స్టైలిష్ అంశాలు ప్రతి సన్నివేశంలోనూ కనిపిస్తూనే ఉంటాయి.

జైలుకెళ్లిన మెగా హీరో

మెగా హీరో శనివారం జైలు కెళ్లారు..అదేదో నేరం చేసి వెళ్లారని అనుకుంటే తప్పులో కాలేసినట్టే.

తాప్పీ ..ఇది చాలా తప్పు...

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.