స్టార్ కమెడియన్ పై శంకర్ పిర్యాదు..
Send us your feedback to audioarticles@vaarta.com
జెంటిల్‌మేన్, ప్రేమికుడు నుండి నేటి 2.0 వరకు డైరెక్టర్ శంకర్ తీసిన ప్రతి సినిమా సెన్సేషన్‌గా నిలిచింది. దర్శకుడిగానే కాకుండా శంకర్ నిర్మాతగా కూడా ఎస్ పిక్చర్స్‌పై సినిమాలను నిర్మిస్తూ కొత్త దర్శకులను ఎంకరేజ్ చేస్తున్నారు.
అందులో భాగంగా గతంలో శంకర్ నిర్మాతగా చింబుదేవన్ దర్శకత్వంలో విడుదలైన సినిమా `23వ పులకేశి` పెద్ద సక్సెస్ సాధించింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ కూడా స్టార్ట్ అయ్యింది. `24వ పులకేశి` పేరుతో రూపొందుతోన్న ఈ చిత్రంలో మళ్లీ వడివేలునే టైటిల్ పాత్ర పోషిస్తున్నాడు. రీసెంట్గా సినిమా కూడా ప్రారంభం అయ్యింది. అయితే ఈసినిమా షూటింగ్‌కు వడివేలు కొన్ని రోజులుగా రావడం లేదట. దాంతో యూనిట్‌కు మేకింగ్ పరంగా నష్టం వాటిల్లుతుందట. దీంతో శంకర్‌కు కోపమొచ్చి విషయాన్ని నిర్మాతల మండలిలో పిర్యాదు చేశారు. మరి దీనిపై వడివేలు ఏమని స్పిదిస్తాడో చూద్దాం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments