నటుడుగా మారుతున్న డైరెక్టర్..
Send us your feedback to audioarticles@vaarta.com
ఉయ్యాల జంపాలా, సినిమా చూపిస్త మామ, కుమారి 21ఎఫ్ చిత్రాలతో హ్యాట్రిక్ సాధించిన యంగ్ హీరో రాజ్‌తరుణ్. ఈ క్రేజీ యువ హీరో నటిస్తున్న తాజా చిత్రం సీతమ్మ అందాలు-రామయ్య సిత్రాలు. ఈ మూవీకి డైరెక్టర్ శ్రీనివాస్ గవిరెడ్డి. ఫ్యామిలీ ఎంటర్టైనర్ విత్ కామెడీతో ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాలో రాజ్‌తరుణ్ పాత్ర సరికొత్తగా వుంటుందంట.
ఇక అసలు విషయానికి వస్తే...ఈ మూవీలో డైరెక్టర్ ఎన్.శంకర్ నటిస్తున్నారట. హీరో రాజ్ తరుణ్ తండ్రి పాత్రలో ఎన్.శంకర్ కనిపిస్తారని సమాచారం. ఈ నెల 10న ఆడియో రిలీజ్ చేసి, 29న సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి..దర్శకుడిగా రాణించిన ఎన్.శంకర్..ఇక నుంచి నటుడుగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తాడేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments