ద్వితీయ విఘ్నం దాటేందుకు సెంటిమెంట్ నమ్ముకున్న డైరెక్టర్..
Send us your feedback to audioarticles@vaarta.com
ద్వితీయ విఘ్నం దాటేందుకు సెంటిమెంట్ నమ్ముకున్న డైరెక్టర్..ఎవరో కాదు అనిల్ రావిపూడి. పటాస్ సినిమాతో సక్సెస్ సాధించిన అనిల్ రావిపూడి ద్వితీయ చిత్రంగా సుప్రీమ్ సినిమాని తెరకెక్కించాడు. అయితే..ఇండస్ట్రీలో చాలా మంది దర్శకులకు ద్వితీయ విఘ్నం తప్పలేదు. ఎంత కష్టపడి వర్క్ చేసినా చాలా మంది దర్శకులకు రెండో సినిమా ఫ్లాప్ అయ్యింది. ఈ విషయం అనిల్ రావిపూడి మైండ్ లో బాగా ఫిక్స్ అయినట్టుంది. అందుకే రెండో సినిమా ప్లాప్ అవ్వడం అనే సెంటిమెంట్ ని బ్రేక్ చేయడం కోసం సెంటిమెంట్ నే నమ్ముకున్నాడు అనిల్.
ఇంతకీ...అనిల్ నమ్ముకున్న సెంటిమెంట్ ఏమిటంటే....పటాస్ సినిమాలో హీరో కళ్యాణ్ రామ్ పోలీస్ గా నటించారు. పటాస్ ఎంత హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సెంటిమెంట్ ని కంటిన్యూ చేస్తూ...సుప్రీమ్ లో హీరోయిన్ తో పోలీస్ క్యారెక్టర్ చేయించారు. అలాగే హీరో కూడా కొంచెం సేపు పోలీస్ క్యారెక్టర్ లో కనిపిస్తాడు. పటాస్ లో బాలయ్య సాంగ్ రీమిక్స్ చేస్తే...సుప్రీమ్ లో చిరు సాంగ్ రీమిక్స్ చేసాడు. అలాగే పటాస్ లో శృతి సోది హీరోయిన్ గా నటిస్తే... సుప్రీమ్ లో శృతిసోది తో ఐటం సాంగ్ చేయించాడు. పటాస్ లో 801 అంటూ బాగా ఎంటర్ టైన్ చేసిన ప్రభాస్ శీను, థర్టీ ఇయర్స్ పృథ్వీ లతో సుప్రీమ్ లోకూడా కామెడీ చేయించాడు. మరి..ద్వితీయ విఘ్నం దాటేందుకు ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న అనిల్ కి సుప్రీమ్ సక్సెస్ అందిస్తుందో లేదో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments