అంపశయ్య కోసం నగ్న దృశ్యాలు చిత్రీకరించిన మాట వాస్తవమే - దర్శకుడు ప్రభాకర్ జైని
Send us your feedback to audioarticles@vaarta.com
అందరూ ఆర్ట్ ఫిల్మ్ అంటున్నారు. మనసుతో చూడాల్సిన హార్ట్ ఫిల్మ్ ఇది. హృదయానికి హత్తుకునే ఓ మధ్య తరగతి విద్యార్థి మానసిక సంఘర్షణలకు దర్పణం పట్టే దృశ్యకావ్యం`` అని దర్శకుడు ప్రభాకర్ జైని అన్నారు. అమ్మా నీకు వందనం`, ప్రణయ వీధుల్లో` చిత్రాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ప్రభాకర్ జైని దర్శకత్వం వహించిన తాజా చిత్రం క్యాంపస్–అంపశయ్య`. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నవీన్ రచించిన అంపశయ్య` నవల ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో శ్యామ్‌కుమార్, పావని జంటగా నటించారు. ప్రభాకర్ జైని, విజయలక్ష్మి జైని ప్రధాన పాత్రలు పోషించారు. ప్రత్యేక పాత్రలో ఆకెళ్ల రాఘవేంద్ర నటించారు. జైనీ క్రియేషన్స్, ఓం నమో భగవతే వాసుదేవాయ ఫిలింస్ పతాకంపై విజయలక్ష్మి జైని నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
చిత్ర దర్శకుడు ప్రభాకర్ జైని మాట్లాడుతూ – నవలలో బోల్డ్ కంటెంట్ ఉంది. ఆ కంటెంట్ ఆధారంగా నగ్న దృశ్యాలు చిత్రీకరించడం జరిగింది. కథానుగుణంగా సహజత్వం కోసమే ఆ సన్నివేశాలు చిత్రీకరించాల్సి వచ్చింది. ఎక్కడా వల్గారిటీ ఉండదు. పాత్రధారుల భావోద్వేగాలు మాత్రమే కనిపిస్తాయి. వ్యాపారాత్మక దృక్పథంతో, కమర్షియల్ ఫార్మాట్లో తీసే ఉద్దేశం లేదు. సాధ్యమైనంత వరకూ 1965–70 సంవత్సరాల్లో ఉన్న తెలంగాణ గ్రామీణ జీవితాన్ని ఆవిష్కరించాలని చేసిన ప్రయత్నమిది. ఇటీవల చిత్రం చూసిన పలువురు సినీ ప్రముఖులు మంచి ప్రయత్నమంటూ ప్రశంసించడం సంతోషాన్నిచ్చింది. ఈ నెల 30న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. ప్రేక్షకులు మా ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను`` అన్నారు.
మోనికా థాంప్సన్, శరత్, యోగి, దివాన్, రాధాకృష్ణ, వాల్మీకి, స్వాతీ నాయుడు తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమేరా: రవికుమార్ నీర్ల, సంగీతం: ఘంటశాల విశ్వనాథ్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout