అంప‌శ‌య్య కోసం న‌గ్న దృశ్యాలు చిత్రీక‌రించిన మాట వాస్త‌వ‌మే - ద‌ర్శ‌కుడు ప్ర‌భాక‌ర్ జైని

  • IndiaGlitz, [Monday,July 25 2016]

అందరూ ఆర్ట్‌ ఫిల్మ్‌ అంటున్నారు. మనసుతో చూడాల్సిన హార్ట్‌ ఫిల్మ్‌ ఇది. హృదయానికి హత్తుకునే ఓ మధ్య తరగతి విద్యార్థి మానసిక సంఘర్షణలకు దర్పణం పట్టే దృశ్యకావ్యం'' అని దర్శకుడు ప్రభాకర్‌ జైని అన్నారు. అమ్మా నీకు వందనం', ప్రణయ వీధుల్లో' చిత్రాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ప్రభాకర్‌ జైని దర్శకత్వం వహించిన తాజా చిత్రం క్యాంపస్‌–అంపశయ్య'. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నవీన్‌ రచించిన అంపశయ్య' నవల ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో శ్యామ్‌కుమార్, పావని జంటగా నటించారు. ప్రభాకర్‌ జైని, విజయలక్ష్మి జైని ప్రధాన పాత్రలు పోషించారు. ప్రత్యేక పాత్రలో ఆకెళ్ల రాఘవేంద్ర నటించారు. జైనీ క్రియేషన్స్, ఓం నమో భగవతే వాసుదేవాయ ఫిలింస్‌ పతాకంపై విజయలక్ష్మి జైని నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

చిత్ర దర్శకుడు ప్రభాకర్‌ జైని మాట్లాడుతూ – నవలలో బోల్డ్‌ కంటెంట్‌ ఉంది. ఆ కంటెంట్‌ ఆధారంగా నగ్న దృశ్యాలు చిత్రీకరించడం జరిగింది. కథానుగుణంగా సహజత్వం కోసమే ఆ సన్నివేశాలు చిత్రీకరించాల్సి వచ్చింది. ఎక్కడా వల్గారిటీ ఉండదు. పాత్రధారుల భావోద్వేగాలు మాత్రమే కనిపిస్తాయి. వ్యాపారాత్మక దృక్పథంతో, కమర్షియల్‌ ఫార్మాట్‌లో తీసే ఉద్దేశం లేదు. సాధ్యమైనంత వరకూ 1965–70 సంవత్సరాల్లో ఉన్న తెలంగాణ గ్రామీణ జీవితాన్ని ఆవిష్కరించాలని చేసిన ప్రయత్నమిది. ఇటీవల చిత్రం చూసిన పలువురు సినీ ప్రముఖులు మంచి ప్రయత్నమంటూ ప్రశంసించడం సంతోషాన్నిచ్చింది. ఈ నెల 30న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. ప్రేక్షకులు మా ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను'' అన్నారు.

మోనికా థాంప్సన్, శరత్, యోగి, దివాన్, రాధాకృష్ణ, వాల్మీకి, స్వాతీ నాయుడు తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమేరా: రవికుమార్‌ నీర్ల, సంగీతం: ఘంటశాల విశ్వనాథ్.

More News

ఆగ‌ష్టు 13న నాగ‌శౌర్య నీ జ‌త‌లేక‌ విడుద‌ల‌

యంగ్‌ హీరో నాగశౌర్య కథానాయకుడిగా, పారుల్‌, సరయు కథానాయికలుగా ఓగిరాల వేమూరి నాగేశ్వరరావు సమర్పణలో శ్రీ సత్య విదుర మూవీస్‌ బ్యానర్‌పై లారెన్స్‌ దాసరి దర్శకత్వంలో జి.వి.చౌదరి, నాగరాజుగౌడ్‌ చిర్రా నిర్మిస్తున్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ 'నీ జతలేక'.

గోపీచంద్, సంప‌త్ నంది మూవీ లేటెస్ట్ అప్ డేట్

మాస్ హీరో గోపీచంద్, హ్యాట్రిక్ హిట్ చిత్రాల దర్శకుడు సంపత్ నందిల క్రేజీ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రాన్ని శ్రీబాలాజీ సినీ మీడియా పతాకంపై జె.భగవాన్-జె.పుల్లారావులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల్లోమాయా మాల్‌

హోరా హోరీ ఫేమ్ దిలీప్ హీరోగా గ్రీష్మ ఆర్ట్స్ స‌మ‌ర్ప‌ణ‌లో వైష్ణ‌వి మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న చిత్రం మాయా మాల్‌. ఇషా హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో సోనియా, దీక్షాపంత్‌, పృథ్వీ, నాగినీడు త‌దిత‌రులు ప్ర‌ధాన తారాగణంగా న‌టించారు.

బాహుబ‌లి రికార్డ్ ను క‌బాలి బ్రేక్ చేస్తుందా..?

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన సంచ‌ల‌న చిత్రం క‌బాలి. ఈ నెల 22న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజైన క‌బాలి ఓవ‌ర్ సీస్ లో రికార్డు స్ధాయి క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేస్తుంది.

చైతు హీరోయిన్ తో విశాల్ రొమాన్స్.

మాస్ హీరో విశాల్ కెరీర్ లో మ‌ర‌చిపోలేని చిత్రం పందెంకోడి. అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్ లో క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ సాధించి విశాల్ కి మంచి పేరు తీసుకువ‌చ్చింది. దీంతో పందెంకోడి చిత్రానికి సీక్వెల్ చేయాల‌ని విశాల్ గ‌త కొన్ని రోజులుగా ప్ర‌య‌త్నిస్తున్నారు.