అఖిల్‌కి నో చెప్పి.. కార్తీకి ఎస్ చెప్పిన దర్శకుడు
Send us your feedback to audioarticles@vaarta.com
రీసెంట్ టైమ్స్‌లో ఓ కోలీవుడ్ దర్శకుడు అఖిల్‌తో సినిమా చేస్తాడని జోరుగా వార్తలు వినిపించాయి. అయితే లేటెస్ట్ సినీ వర్గాల సమాచారం మేరకు ఈ దర్శకుడు ఇప్పుడు అఖిల్‌కు నో చెప్పేసి కార్తీతో సినిమా చేయడానికి ఓకే అన్నాడట. ఇంతకు ఆ దర్శకుడెవరో కాదు.. పి.ఎస్.మిత్రన్. విశాల్‌తో అభిమన్యుడు సినిమా చేసి హిట్ కొట్టాడు మిత్రన్. తర్వాత కార్తికేయన్‌తో హీరో సినిమా చేసే సమయంలో అఖిల్‌తో చర్చలు జరిపాడు. ఆ సమయంలో అఖిల్‌తో మిత్రన్ సినిమా చేస్తాడని, దాదాపు ఖాయమైందని వార్తలు బలంగా వినిపించాయి.
కానీ ఏం జరిగిందో ఏమో కానీ ఇప్పుడు ఈ దర్శకుడు కార్తితో సినిమా చేస్తున్నాడట. కార్తి కూడా మిత్రన్ కథకు ఓకే చెప్పాడట. ఈ చిత్రంలో కార్తి ద్విపాత్రాభినయం చేయబోతున్నాడట. ఈ ఏడాది దేవ్, ఖైదీ, దొంగ సినిమాలు కార్తి.. మిత్రన్ సినిమాకు ఓకే చెప్పాడు. అయితే అఖిల్ సినిమా ఆగిందా? లేక బొమ్మరిల్లు భాస్కర్ సినిమా పూర్తయ్యేలోపు కార్తితో సినిమాను మిత్రన్ పూర్తి చేసి తర్వాత అఖిల్‌తో చేస్తాడా? అని తెలియాల్సి ఉంది. మరి దీనిపై అఖిల్ వర్గం ఎలా స్పందిస్తుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout