ఫస్ట్ ఈ ప్రాజెక్టులో నేను లేను: ‘మేజర్’ దర్శకుడు

  • IndiaGlitz, [Monday,April 12 2021]

‘గూఢచారి’గా ఎంతగానో ఆకట్టుకున్న యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో అడవి శేష్.. ప్రస్తుతం ‘మేజర్’గా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. 26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలను అర్పించిన దివంగత ఆర్మీ ఆఫీసర్ మేజ‌ర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెర‌కెక్కుతోన్న చిత్రం 'మేజ‌ర్'‌. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో.. అడివి శేష్ మేజ‌ర్‌గా టైటిల్ రోల్ పోషిస్తున్నారు. ప్యాన్ ఇండియా మూవీగా ఈ చిత్రం రూపొందుతోంది. శోభితా ధూళిపాల, సాయి మంజ్రేకర్, ప్రకాష్ రాజ్, రేవతి, మురళి శర్మ ముఖ్య పాత్రల్లో నటించారు. మహేష్ బాబు జిఎమ్‌బి ఎంటర్టైన్మెంట్, ఏప్ల‌స్ఎస్‌ మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. 'మేజర్' చిత్రం జూలై 2న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌కాబోతుంది. ఈ చిత్ర తెలుగు టీజ‌ర్‌ను సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు, హిందీ వెర్ష‌న్ టీజ‌ర్‌ను స‌ల్మాన్‌ఖాన్‌, మ‌ళ‌యాల టీజ‌ర్‌ను హీరో పృథ్విరాజ్ సోమవారం సాయంత్రం విడుదల చేశారు. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్ ఏఎంబీ మాల్‌లో చిత్రయూనిట్‌ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో ద‌ర్శ‌కుడు శ‌శి కిర‌ణ్ తిక్కా మాట్లాడుతూ.. ‘‘మేజ‌ర్ జ‌ర్నీ శేష్ నుంచే స్టార్ట్ అయ్యింది. ఫ‌స్ట్ ఈ ప్రాజెక్ట్‌లో నేను లేను.. త‌ర్వాత శేష్ ఈ ప్రాజెక్ట్‌లోకి న‌న్ను తీసుకొచ్చాడు. ముందు ఈ ప్రాజెక్టు చేయొద్దనుకున్నా. కానీ శేష్ సందీప్ గురించి నాకు చెప్పిన‌ప్పుడు, త‌ర్వాత వారి త‌ల్లిదండ్రుల‌ను వెళ్లి క‌‌లిసిన‌ప్పుడు ఇది చెప్ప‌క‌పోతే త‌ప్పు అవుతుంద‌ని భావించాను. సందీప్ ఉన్ని కృష్ణ‌న్ జీవితం న‌న్ను క‌దిలించిన విధానం.. ఇన్‌స్పైర్‌ చేసిన విధానం ఈ సినిమాతో రెండేళ్లు జ‌ర్నీ చేయించింది. నా లైఫ్ లాంగ్ ఈ మూవీ గురించి చాలా గ‌ర్వంగా చెప్పుకుంటాను’’ అని పేర్కొన్నారు.

హీరోయిన్ సాయి మంజ్రేకర్ మాట్లాడుతూ.. ‘‘ఈ మూవీ షూటింగ్ చాలా ఫ‌న్నీగా జ‌రిగింది. ఈ సినిమా నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన‌ప్పుడు ఫ‌స్ట్ మా పేరెంట్స్ నువ్వు త‌ప్ప‌కుండా చేయాలి అని చెప్పారు. వాళ్ల స‌పోర్ట్ తోనే ఈ మూవీ చేయ‌గ‌లిగాను. ఈ మూవీ ఒక గ్రేట్ లెర్నింగ్ ఎక్స్‌పీరియ‌న్స్‌. శశి, శేష్ నుంచి చాలా నేర్చుకున్నాను. ఇంకా నాలుగు రోజులు షూట్ బ్యాలెన్స్ ఉంది. ఈ మూవీ రిలీజ్‌ కోసం చాలా ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నాను..’’ అని తెలిపింది.

మరో హీరోయిన్ శోభిత ధూళిపాల మాట్లాడుతూ.. ఇదే థీమ్‌తో గూడ‌ఛారి మూవీ షూట్ చేశాం.. కాబ‌ట్టి ఈ టీమ్‌తో మంచి అనుబంధం ఏర్ప‌డింది. మేము ఒకరినొకరం అర్థం చేసుకున్నాం. మేజ‌ర్‌లాంటి ఒక గొప్ప‌ మూవీలో భాగం అవ‌డం చాలా గ‌ర్వంగా ఉంది. ఈ సినిమాలో భాగమవడం గర్వంగా భావిస్తున్నా. ప్ర‌తి సీన్ రెండు భాష‌ల‌లో షూట్ చేశాం. మా టీమ్ అంద‌రికీ ఒక యూనిక్ ఎక్స్‌పీరియ‌న్స్. షూటింగ్ చేసిన ప్ర‌తి రోజు చాలా హ్యాపీగా ఫీల‌య్యాం’’ అన్నారు

నిర్మాత శ‌ర‌త్ మాట్లాడుతూ.. ‘‘ఇది ఒక థియేట్రిక‌ల్ ఎక్స్‌పీరియ‌న్స్ మూవీ. మాకు స‌పోర్ట్ చేసిన న‌మ్ర‌త మేడ‌మ్‌, మ‌హేష్ స‌ర్‌కి థ్యాంక్స్‌. నమ్రత గారు, మహేష్ గారు చాలా ఎక్సైట్ అయ్యారు. అలాగే సోనీ పిక్చ‌ర్స్ వారు మాతో భాగ‌స్వామ్యం అవ‌డం హ్యాపీ.. ఈ సినిమాలో వ‌ర్క్ చేసిన ప్ర‌తి ఒక్క‌రికీ థ్యాంక్యూ సో మ‌చ్‌'' అని చెప్పారు. మరో నిర్మాత అనురాగ్ మాట్లాడుతూ.. మేం చెప్పిన కాన్సెప్ట్‌ని న‌మ్మి ఈ ప్రాజెక్ట్‌లో భాగం అయిన న‌మ్ర‌త‌, మ‌హేష్‌బాబుగారికి ధ‌న్య‌వాదాలు. సోనీ పిక్చ‌ర్స్ వారు ఎన్నో భాష‌ల‌లో సినిమాలు చేశారు. వారు ఎక్క‌డికి వెళ్లినా ఈ సినిమా హైద‌రాబాద్ నుండే చేశాం అని గ‌ర్వంగా చెప్పుకునే విధంగా ఈ సినిమా ఉంటుంది. అలాగే మ‌మ్మ‌ల్ని న‌మ్మి ఈ అవ‌కాశం ఇచ్చిన శేష్‌కి థ్యాంక్స్‌. శ‌శి చాలా బ్యాటిఫుల్‌గా ఈ మూవీని తెర‌కెక్కించారు. యంగ్ టీమ్ అంద‌రం క‌లిసి చేసిన మూవీ ఇది. ఈ టీమ్‌లో భాగం కావ‌డం చాలా హ్యాపీగా ఉంది’’ అన్నారు.

More News

అడవి శేష్ ‘మేజర్’ టీజర్ అదిరిపోయింది..

‘గూఢచారి’,‘ఎవరు’ చిత్రాల తర్వాత హీరోగా అడవి శేష్‌కి ఒక మంచి గుర్తింపు వచ్చింది. నాలుగు ఫైట్లు, నాలుగు డ్యూయెట్లు వంటి రొటీన్ రొమాంటిక్ మూవీస్‌కి స్వస్తి పలికి..

శివ కందుకూరి హీరోగా పి19 ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా

శివ కందుకూరి హీరోగా పి19 ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై యువ వ్యాపారవేత్త సురేష్ రెడ్డి కొవ్వూరి ఓ సినిమా నిర్మిస్తున్నారు.

‘వకీల్ సాబ్’ను అడ్డుకునే వ్యక్తి కాదు జగన్: నాగబాబు

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాత్రమే కాదు జనసేన అధినేత కూడా. అయితే ఆయన రాజకీయాల్లో నెగ్గుకురావాలంటే రిసోర్సెస్ కావాలని..

నవీన్ పొలిశెట్టికి భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసిన నిర్మాత!

గతంలో ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’గా వచ్చి నవీన్ పొలిశెట్టి తనకంటూ ఇండస్ట్రీలో ఓ బెంచ్ మార్కును క్రియేట్ చేసుకున్నాడు.

‘వకీల్ సాబ్’ ఉగాది సర్‌ప్రైజ్ చూశారా?

పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘వకీల్‌ సాబ్‌’. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో దూసుకెళుతోంది.