బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న సంక‌ల్ప్‌

  • IndiaGlitz, [Wednesday,February 26 2020]

సంక‌ల్ప్ రెడ్డి.. 'ఘాజీ', 'అంత‌రిక్షం' సినిమాలో అంద‌రి దృష్ఠిని ఆక‌ర్షించాడు. ఇప్పుడు కొన్ని నిజ ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని ఓ భారీ యాక్ష‌న్ సినిమా చేస్తున్నాడు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే.. ఈసారి సంకల్ప్ త‌న సినిమాను హిందీలో తెర‌కెక్కించ‌బోతున్నాడు. ఈ సినిమాలో హీరో ఎవ‌రో తెలుసా? విద్యుజ‌మాల్‌. క‌త్తి, శ‌క్తి, సికింద‌ర్ వంటి చిత్రాల్లో న‌టించాడు. ఇప్పుడు సంక‌ల్ప్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న సినిమాలో కమాండ‌ర్2 త‌ర్వాత న‌టిస్తున్నాడు. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్ర‌క‌టన వెలువ‌డ‌నుంది.

షార్ట్ ఫిలిం చేయాల‌నుకున్న ఓ వ్య‌క్తి. రానా ద‌గ్గుబాటికి, నిర్మాత పివిపికి క‌థ న‌చ్చ‌డంతో ద‌శ తిరిగింది. ద‌ర్శ‌కుడిగా మారాడు. తొలి సినిమాను అండ‌ర్ వాట‌ర్‌లో ఉండే స‌బ్‌మెరైన్ మీద 'ఘాజీ' పేరుతో తెర‌కెక్కించాడు. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో విడుద‌లైన ఈ సినిమా భారీ విజ‌యాన్ని సాధించింది. త‌ర్వాత అంత‌రిక్ష్య నేప‌థ్యంలో తెర‌కెక్కిన అంత‌రిక్ష్యం 9000 కెఎంపిహెచ్ సినిమా ఆశించిన స్థాయిలో విజ‌యం సాధించ‌లేదు. త‌ర్వాత ఈ ద‌ర్శ‌కుడిని ఎవ‌రూ పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు కొన్ని నిజ ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని సంక‌ల్ప్ యాక్ష‌న్ మూవీ స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్నాడ‌ట‌.

More News

'త‌లైవి' డైరెక్ట‌ర్‌పై ర‌చ‌యిత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!!

బాలీవుడ్ హీరోయిన్ కంగ‌నా ర‌నౌత్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం `త‌లైవి`. త‌మిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత

చిరంజీవి సినిమాలో మహేష్ బాబు పాత్ర ఇదే ?

ప్ర‌స్తుతం మ‌హేశ్ 27వ సినిమా వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో చేయాల్సింది ..క‌థ బాగోలేద‌నే కార‌ణంతో ఆగింది.

రొమాంటిక్‌ హర్రర్ 'బంజార' టీజ‌ర్ విడుద‌ల‌

మంచి కుటుంబ కథాంశంతో కూడిన హర్రర్ హిట్ మూవీ "క్షుద్ర"  చిత్రాన్ని అందించిన  దర్శకుడు నాగుల్ దర్శకత్వంలో

వ‌ర్మ‌ను పెళ్లి చేసుకోవాల‌నుకుంటున్న న‌టి..

వివాద‌స్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ‌ను ఓ న‌టి పెళ్లి చేసుకోవాల‌నుకుంద‌ట‌. ఇంత‌కు వ‌ర్మ‌ను పెళ్లి చేసుకోవాల‌నుకున్న న‌టి ఎవ‌రు?

లీగల్ నోటీసులిచ్చి.. తాటతీస్తాం : జనసేన వార్నింగ్

సామాజిక మాద్యమాల్లో జనసేన పార్టీని, పార్టీ విధానాలను తప్పుబడుతూ పోస్టులు బెడుతున్న వారి భరతం పట్టాలని అధిష్టానం నిర్ణయించింది.