ఆందోళనకరంగా డైరెక్టర్ సంజనారెడ్డి ఆరోగ్య పరిస్థితి!
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు దినపత్రికలో జర్నలిస్టుగా పనిచేసి ‘రాజుగాడు’ సినిమాతో టాలీవుడ్‌కు దర్శకురాలిగా పరిచయం అయిన సంజనారెడ్డి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. గత వారం రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న సంజనాను కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. తీవ్ర ఆందోళనకు గురైన కుటుంబీకులు ఆమెకు టెస్ట్‌లు చేయించగా బ్రెయిన్ ఇన్ఫెక్షన్ అయ్యే లక్షణాలు ఎక్కువగా ఉన్నాయని వైద్యులు చెప్పారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అప్రమత్తమైన వైద్యులు హుటాహుటిన ఆ వార్డు నుంచి ఐసీయూకు షిప్ట్ చేసి వైద్యం అందిస్తున్నారు.
కాగా.. జ్వరం వచ్చినప్పట్నుంచి అన్నం తినకుండా కొబ్బరి నీళ్లు, లిక్విడ్ డైట్ తీసుకున్నారని తెలుస్తోంది. అలా తీసుకోవడం వల్లే నీరసించి కింద పడిపోయారని దీంతో హుటాహుటిన కుటుంబీకులు, స్నేహితులు ఆస్పత్రికి తీసుకెళ్లారని సమాచారం. ఇదిలా ఉంటే.. ఒలింపిక్ పతక విజేత, ప్రముఖ వెయిట్ లిఫ్టర్ ‘కరణం మల్లీశ్వరి’ బయోపిక్‌ను ప్రకటించి సంజనారెడ్డి హాట్‌టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. అయితే ఆ ప్రకటన ఇచ్చిన కొన్ని రోజులకే ఆమె ఆరోగ్య పరిస్థితి ఇలా అయ్యింది. ఇప్పటికే పలువురు టాలీవుడ్‌లోని సంజనా సన్నిహితులు, మిత్రులు.. కరణం మల్లీశ్వరి కూడా ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారని తెలుస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout