ఆందోళనకరంగా డైరెక్టర్ సంజనారెడ్డి ఆరోగ్య పరిస్థితి!

  • IndiaGlitz, [Tuesday,June 09 2020]

తెలుగు దినపత్రికలో జర్నలిస్టుగా పనిచేసి ‘రాజుగాడు’ సినిమాతో టాలీవుడ్‌కు దర్శకురాలిగా పరిచయం అయిన సంజనారెడ్డి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. గత వారం రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న సంజనాను కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. తీవ్ర ఆందోళనకు గురైన కుటుంబీకులు ఆమెకు టెస్ట్‌లు చేయించగా బ్రెయిన్ ఇన్‌ఫెక్షన్ అయ్యే లక్షణాలు ఎక్కువగా ఉన్నాయని వైద్యులు చెప్పారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అప్రమత్తమైన వైద్యులు హుటాహుటిన ఆ వార్డు నుంచి ఐసీయూకు షిప్ట్ చేసి వైద్యం అందిస్తున్నారు.

కాగా.. జ్వరం వచ్చినప్పట్నుంచి అన్నం తినకుండా కొబ్బరి నీళ్లు, లిక్విడ్ డైట్ తీసుకున్నారని తెలుస్తోంది. అలా తీసుకోవడం వల్లే నీరసించి కింద పడిపోయారని దీంతో హుటాహుటిన కుటుంబీకులు, స్నేహితులు ఆస్పత్రికి తీసుకెళ్లారని సమాచారం. ఇదిలా ఉంటే.. ఒలింపిక్‌ పతక విజేత, ప్రముఖ వెయిట్ లిఫ్టర్ ‘కరణం మల్లీశ్వరి’ బయోపిక్‌ను ప్రకటించి సంజనారెడ్డి హాట్‌టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. అయితే ఆ ప్రకటన ఇచ్చిన కొన్ని రోజులకే ఆమె ఆరోగ్య పరిస్థితి ఇలా అయ్యింది. ఇప్పటికే పలువురు టాలీవుడ్‌లోని సంజనా సన్నిహితులు, మిత్రులు.. కరణం మల్లీశ్వరి కూడా ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారని తెలుస్తోంది.

More News

జగన్‌తో భేటీకి చార్టడ్ ఫ్లైట్‌లో చిరు, నాగ్, జక్కన్న

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డితో టాలీవుడ్ సినీ పెద్దలు ఇవాళ భేటీ కానున్నారు.

కేసీఆర్, తలసానికి థ్యాంక్స్ చెప్పిన చిరు

టాలీవుడ్ సినిమా, టీవీ, సీరియల్స్ షూటింగ్స్ జరుపుకోవచ్చని ఇదివరకే చెప్పిన తెలంగాణ సర్కార్.. తాజాగా అందుకు సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేసింది.

చిరు సూచనతో ‘ఆచార్య’లో మార్పులు, చేర్పులు..!

కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే పలు రంగాలు ఈ వైరస్ దెబ్బకు కుదేలయ్యాయి. అంతేకాదు.. బహుశా ఆయా రంగాలు కోలుకోవడానికి ఎన్నేళ్లు పడుతుందో..

బాలయ్య బర్త్ డేపై బ్రాహ్మణి ఎమోషనల్ మెసేజ్..

టాలీవుడ్ సీనియర్ నటుడు కమ్ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈ నెల 10న పుట్టిన రోజు. ఈ పదో తారీఖుతో బాలయ్య 60వ పడిలోకి అడుగుపెట్టబోతున్నారు.

కరోనా దయవల్ల హ్యాపీగా ఉన్నా..: ఆర్జీవీ

ఇదేంటి టైటిల్ చూడగానే.. ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికిస్తుంటే.. లోకమంతా భయంతో వణికిపోతుంటే.. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ హ్యాపీగా ఉండటమేంటి..?