సందీప్ వంగా ఇంట్లోకి లిటిల్ ఏంజల్ వచ్చేసింది!
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్‌లో సింగిల్ సినిమాతో సెన్సేషనల్ అయిన సందీప్‌రెడ్డి వంగా గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ‘అర్జున్ రెడ్డి’ సినిమాను తెరకెక్కించిన ఆయన తన సత్తా ఏంటో టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కు చాటి చెప్పారు. అంతేకాదు.. ఆ ‘అర్జున్‌రెడ్డి’ సినిమాను ‘కబీర్‌సింగ్’గా బాలీవుడ్‌లో కూడా రీమేక్ చేయడం జరిగింది. అయితే.. మరో ఒకట్రెండు కథలు కూడా సిద్ధంగా చేసుకున్నారని అప్పట్లో వార్తలు వినిపించాయి. ఇలా మంచి ఊపు మీదున్న ఆయన ఇంట్లోకి లిటిల్ ఏంజిల్ వచ్చేసింది!
సందీప్ సతీమణి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని తెలుసుకున్న ఆయన సన్నిహితులు, తోటి దర్శకులు కంగ్రాట్స్ చెబుతున్నారు. ఈ మేరకు ఆయన్ను ట్యాగ్ చేస్తూ అభినందిస్తున్నారు. లిటిల్ ఏంజల్‌కు వెల్‌కమ్ చెబుతున్నారు. దర్శకులతో పాటు పలువురు ప్రముఖులు కూడా సందీప్‌కు కంగ్రాట్స్ చెబుతున్నారు. కాగా.. ప్రస్తుతం వంగా దగ్గరున్న కథలకు హీరోలను వెతికే పనిలో ఆయన నిమగ్నమయ్యారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments