సంపత్ శ్రీను దర్శకత్వంలో శ్రీను.కె నిర్మాతగా ప్రొడక్షన్ 2 ప్రారంభం
Send us your feedback to audioarticles@vaarta.com
ఎస్ పి క్రియేషన్స్ సమర్పణలో యస్.యస్.సి క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్2గా సంపత్ శ్రీను దర్శకత్వంలో శ్రీను.కె నిర్మాతగా మహి, సందీప్, శ్యామ్, గణేష్ రెడ్డి, సోనాలి, వాసు ప్రధాన పాత్రలలో రూపొందుతోన్న చిత్రం నవంబర్ 23న హైదరాబాద్ ఫిలింఛాంబర్‌లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి అభిరుచి గల నిర్మాత రాజ్ కందుకూరి క్లాప్ నివ్వగా, ప్రముఖ నిర్మాత దామోదర్ ప్రసాద్ కెమెరా స్విచ్చాన్ చేశారు. ప్రముఖ దర్శకుడు ఎ.కోదండ రామిరెడ్డి స్క్రిప్ట్ ను దర్శకుడు సంపత్ శ్రీనుకి అందించారు. ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మొదటి సన్నివేశానికి గౌరవదర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా..
తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ - "చిన్న సినిమాలకి, కాన్సెప్ట్ సినిమాలకి మంచి ఆదరణ ఉంది. కొత్తవారైనా సరే కాన్సెప్ట్ బాగుంటే ప్రేక్షకులు ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ సినిమా కూడా అదే కోవలోకి రావాలని కోరుకుంటూ దర్శక నిర్మాతలను అభినందిస్తున్నాను" అన్నారు.
ఎ.కోదండ రామిరెడ్డి మాట్లాడుతూ - "ప్రధమ ప్రయత్నంగా దర్శకుడు కథ రాసుకొని ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. అలాగే నటీనటులందరికి ఆల్ ది బెస్ట్" అన్నారు.
దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ - "చిన్న సినిమా అయినా సరే క్వాలిటీ, కంటెంట్ చాలా ముఖ్యం. అలాంటి మంచి సినిమా అవుతుందని ఆశిస్తున్నాను. అందరికీ ఆల్ ది బెస్ట్"అన్నారు.
నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ - "సినిమాలో కంటెంట్ ఉండి టీజర్, ట్రైలర్ తో మెప్పించగలిగితే మంచి బిజినెస్ అవుతున్న రోజులివి. కంటెంట్ ని కథను నమ్ముకొని సినిమా చేస్తే తప్పకుండా మంచి విజయం సాధిస్తారు" అన్నారు.
దర్శకుడు సంపత్ శ్రీను మాట్లాడుతూ - "యస్.యస్.సి క్రియేషన్స్ లో నిర్మాతగా నారెండవ సినిమా అలాగే దర్శకుడిగా నా మొదటి సినిమా కథ మీద నమ్మకంతో మంచి కంటెంట్ తో మీ ముందుకు వస్తున్నాను" అన్నారు.
సందీప్ రెడ్డి మాట్లాడుతూ - "స్టోరీ నచ్చి ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. కథ చాలా బాగుంది, అలాగే డిఫరెంట్ గా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన సంపత్ గారికి థాంక్స్"అన్నారు.
హీరో మహి మాట్లాడుతూ - " నాకు తన రెండో సినిమాలో కూడా అవకాశం ఇచ్చిన సంపత్ గారికి ధన్యవాదాలు. టీమ్ అందరికీ బెస్ట్ ఆఫ్ లక్" అన్నారు.
సోనా పటేల్ మాట్లాడుతూ - : ``మంచి కథ, నా రోల్ కీలకంగా ఉండబోతుంది`` అన్నారు
సోనాలి మాట్లాడుతూ - " ఇది నా సెకండ్ మూవీ మీ అందరి బ్లేసింగ్స్ కావలి" అన్నారు.
శ్యామ్ మాట్లాడుతూ - " కథ పరంగా చాలా బాగుంది. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది" అన్నారు.
నిర్మాత శ్రీను.కె మాట్లాడుతూ - "నేను సింగల్ గానే ఈ సినిమా స్టార్ట్ చేద్దాం అని ప్రయత్నం చేస్తున్న సమయంలో ఆర్ కె గారు కథ విని కో - ప్రొడ్యూసర్ గా ముందుకు వచ్చారు. ఆయన ద్వారా కె.లక్ష్మణ్ రావు గారు పరిచయమయ్యారు. కథ, కథలోని కంటెంట్ విని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా వారిద్దరికీ కృతజ్ఞతలు. మహేష్ తో ఇది నా రెండవ సినిమా. నా మొదటి సినిమా 'విన్నర్ స్కిప్' డిసెంబర్ లో ఆడియో విడుదల చేస్తాం. గోవా, బెంగుళూరు, అమలాపురం, లో షూటింగ్ ప్లాన్ చేస్తున్నాము. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి 2020 మార్చి లో విడుదల చేస్తాం" అన్నారు.
మహి, సందీప్, శ్యామ్, గణేష్ రెడ్డి, సోనాలి, వాసు, తనికెళ్ళ భరణి, గీతా సింగ్, రవీంద్ర, అప్పారావు, జబర్దస్త్ వినోద్, పవన్, సుధా, కార్తిక దీపం ఫేమ్ సౌందర్య, యశ్వంత్, విజయ, వెంకట్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి...
సినిమాటోగ్రఫీ: శ్రీ రామ్ కిరణ్, రచన: శ్రీను కడారి, రాజశేఖర్ తంగెళ్ల, సంగీతం: శరన్, ఎడిటింగ్ : ఈశ్వర్ విరాట్, ప్రొడక్షన్ మేనేజర్: కుందూరు గోపి కృష్ణా రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కె.లక్ష్మణ్ రావు, కో - ప్రొడ్యూసర్: రామకృష్ణ వోలేటి, నిర్మాత: శ్రీను.కె, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సంపత్ శ్రీను.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments