కాజ‌ల్ వివాదం పై ద‌ర్శ‌కుడి స్పంద‌న‌

  • IndiaGlitz, [Monday,December 31 2018]

బాలీవుడ్ చిత్రం క్వీన్ రీమేక్‌ను ద‌క్షిణాదిన నాలుగు భాష‌ల్లోనూ తెర‌కెక్కిస్తున్నారు. అందులో త‌మిళ వెర్ష‌న్‌లో కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టించింది. పారిస్ పారిస్ అనే పేరుతో త‌మిళ వెర్ష‌న్‌ను ర‌మేష్ అర‌వింద్ తెర‌కెక్కించారు.

ఈ సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. కాగా ఇటీవ‌ల విడుద‌లైన టీజ‌ర్‌లో కాజ‌ల్ న‌టించిన స‌న్నివేశం వివాదానికి దారి తీసింది. దీనిపై ద‌ర్శ‌కుడు ర‌మేష్ అర‌వింద్ స్పందిస్తూ.. ట్రైల‌ర్‌లోని చిన్న బిట్ వ‌ల్ల త‌ప్పుగా వివాదం చేల‌రేగింది.

అయితే ద‌య‌చేసి అందులో త‌ప్పులు వెత‌కొద్దు. హిందీ వెర్ష‌న్‌లో కూడా ఆ సీన్ ఉంది. సినిమాలో ఆ సీన్ త‌ప్పుగా అనిపించ‌దు. ఆ సీన్‌కు ఉన్న ప్రాధాన్య‌త‌ను బ‌ట్టే ఆ సీన్‌ను తెర‌కెక్కించాం.. అన్నారు.