అఖిల్ సినిమాకి కూడా అలాగే చేస్తున్న దర్శకుడు
Send us your feedback to audioarticles@vaarta.com
‘తొలిప్రేమ’ సినిమాతో టాలీవుడ్లోకి దర్శకుడిగా అడుగుపెట్టి ఘనవిజయాన్ని సొంతం చేసుకున్నారు వెంకీ అట్లూరి. ప్రస్తుతం.. అఖిల్ హీరోగా తన తదుపరి చిత్రాన్ని రూపొందించే పనిలో ఉన్నారు ఈ దర్శకుడు. ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాని బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్ కథానాయికగా ఎంపికైన ఈ చిత్రం.. జూన్ నుంచి నిరవధికంగా చిత్రీకరణ జరుపుకోనుంది.
ఇదిలా ఉంటే.. యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను యు.కెలో చిత్రీకరించన్నట్టు తెలుస్తోంది. వెంకీ గత చిత్రం కూడా యు.కెలోని కొన్ని రిచ్ లోకేషన్స్‌లో షూటింగ్ జరుపుకుంది. మంచి సినిమాటోగ్రఫీతో తెరకెక్కించిన ఈ సన్నివేశాలు ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి. దీంతో ఇప్పుడు అఖిల్‌తో రూపొందించబోయే సినిమా కోసం యు.కె సెంటిమెంట్‌ను రిపీట్ చేయడానికి సిద్ధపడ్డారు వెంకీ. అందుకే యు.కెలో మూడు వారాల పాటు సాగే ఓ షెడ్యూల్‌ను కూడా ప్లాన్ చేస్తున్నారు. మరి ఈసారి కూడా యు.కె సెంటిమెంట్ కలిసొస్తుందో లేదో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments