అందర్నీ ఆకట్టుకునే ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అబ్బాయితో అమ్మాయి - డైరెక్టర్ రమేష్ వర్మ

  • IndiaGlitz, [Tuesday,December 29 2015]

ఒక ఊరిలో.., రైడ్, వీర‌...ఇలా వైవిధ్య‌మైన చిత్రాల‌ను అందించిన డైరెక్ట‌ర్ ర‌మేష్ వ‌ర్మ‌. నాగ‌శౌర్య‌, ప‌ల్ల‌క్ ల‌ల్వాని జంట‌గా ర‌మేష్ వ‌ర్మ తెర‌కెక్కించిన తాజా చిత్రం అబ్బాయితో అమ్మాయి. ఈ చిత్రాన్ని నూత‌న సంవ‌త్స‌రం కానుక‌గా జ‌న‌వ‌రి 1న రిలీజ్ చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా అబ్బాయితో అమ్మాయి సినిమా గురించి డైరెక్ట‌ర్ ర‌మేష్ వ‌ర్మ తో ఇంట‌ర్ వ్యూ మీకోసం...

అబ్బాయితో అమ్మాయి కాన్సెప్ట్ ఏమిటి..?

ప్ర‌జెంట్ ట్రెండ్ కి అనుగుణంగా ఉండే ఓ డిఫ‌రెంట్ ల‌వ్ స్టోరి ఇది. ఇప్పుడు ల‌వ్ అయినా ఫ్రెండ్ షిప్ అయినా ఫేస్ బుక్ ద్వారానే జ‌రుగుతుంది. ఫేస్ బుక్ ద్వారా ప‌రిచ‌యం అయిన అబ్బాయి, అమ్మాయి లైఫ్ లో ఏం జ‌రిగింది..? అనేది చాలా ఇంట్ర‌స్టింగ్ గా ఉంటుంది. అమ్మాయి అయినా అబ్బాయి అయినా బాగా ప‌రిచ‌యం ఉన్న వాళ్ల‌తో ఎలా ఉంటారు..?. కొత్త‌గా ప‌రిచ‌యం అయిన వాళ్ల‌తో ఎలా ఉంటారు..? వాళ్ల సైకాల‌జీ ఎలా ఉంటుంది అనేది ఈ సినిమాలో చూపించాం. సినిమాలో ఫీల్ ఉంటుంది. ఇంత‌కు మించి ఈ క‌థ గురించి ఎక్కువుగా చెప్ప‌లేను. కానీ...ఒక్క‌టి మాత్రం చెప్ప‌గ‌ల‌ను ల‌వ్ స్టోరీస్ చాలా వ‌చ్చిన‌ప్ప‌టికీ ఈ క‌థ చాలా కొత్త‌గా ఉంటుంది.

ఫేస్ బుక్ కాన్సెప్ట్ తో గ‌తంలో సినిమాలు వ‌చ్చాయి క‌దా..మ‌రి ఇందులో ఉన్న కొత్త‌ద‌నం ఏమిటి...?

ఫేస్ బుక్ కాన్సెప్ట్ తో గ‌తంలో సినిమాలు వ‌చ్చి ఉండ‌చ్చు. అయితే అందులో ఫేస్ బుక్ ని మిస్ యూజ్ చేస్తే ఎలాంటి ప‌రిణామాలు ఏర్ప‌డ‌తాయి అనేది చూపించి ఉండ‌చ్చు. అయితే మా సినిమాలో ఫేస్ బుక్ ని పాజిటివ్ గా చూపిస్తున్నాం. సినిమా చాలా ఫ్రెష్ గా ఉంటుంది

వీర సినిమా త‌ర్వాత బాగా గ్యాప్ రావ‌డానికి కార‌ణం ఏమిటి...?

నేను వెంట వెంట‌నే సినిమాలు చేసేయాల‌నుకోను. నాకు కొంచెం బ‌ద్ద‌కం ఎక్కువ‌. రైడ్ హిట్ అయ్యింది క‌నుక వీర సినిమా వ‌చ్చింది. అస‌లు వీర కాకుండా ఓ ల‌వ్ స్టోరి చేయాల‌నుకున్నాను.బాల‌య్య బాబుతో సినిమా చేసే అవ‌కాశం వ‌చ్చింది. అయితే మూడు సినిమాలు చేసిన నేను బాల‌య్య‌తో సినిమా చేయ‌గ‌ల‌నా అనే అనుమానంతో నేనే సినిమా చేయ‌లేన‌ని త‌ప్పుకున్నాను. ఆత‌ర్వాత ర‌వితేజ‌, గోపీచంద్ కాంబినేష‌న్లో రేస్ రీమేక్ చేయాల‌నుకున్నాను. రేస్ రీమేక్ రైట్స్ కూడా తీసుకున్నాను. భ‌వ్య క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై ఆనంద్ ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తాన‌న్నారు. అయితే ముందు ఓకె చెప్పినా త‌ర్వాత గోపీచంద్ నో చెప్ప‌డంతో ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింది. ఆత‌ర్వాత ర‌వితేజ‌తో వీర చేసాను. వీర త‌ర్వాత వ‌స్తా నీ వెన‌క సినిమా చేయాల‌నుకున్నాను. కానీ...ఇళ‌య‌రాజా గార్కి అబ్బాయితో అమ్మాయి, వ‌స్తా నీ వెన‌క క‌థ‌లు చెబితే ముందు అబ్బాయితో అమ్మాయి సినిమా చేయ‌మ‌న్నారు. అందుచేత వ‌స్తా నీ వెన‌క సినిమా ఆపి ఈ సినిమా చేసాను.

అబ్బాయితో అమ్మాయి టైటిల్ జ‌స్టిఫికేష‌న్ ఏమిటి..?

ఇప్ప‌టి వ‌ర‌కు సినిమాల్లో అమ్మాయి వెంట‌ప‌డుతూ అబ్బాయిలు టీజ్ చేయ‌డం ఎక్కువుగా చూపించారు క‌దా..అమ్మాయితో అబ్బాయి అని టైటిల్ పెట్ట‌చ్చు. కాక‌పోతే కాస్త కొత్త‌గా ఉంటుంద‌ని అబ్బాయితో అమ్మాయి అని పెట్టాం.

అబ్బాయితో అమ్మాయి లో హైలెట్ ఏమిటి..?

ఇళ‌య‌రాజా మ్యూజిక్, శ్యామ్ కె నాయుడు ఫోటోగ్ర‌ఫీ, స్టోరి..ఈ మూడు హైలెట్.

ఈ సినిమాకి ఇన్ స్పిరేష‌న్ ఏమిటి..?

ఈ సినిమాకి ఇన్ స్పిరేష‌న్ అంటే యూత్. ప్ర‌స్తుతం స‌మాజంలో ఏం జ‌రుగుతుందో అదే చూపించాను. ఇక్క‌డో విష‌యం చెప్పాలి..నేను రాసుకున్న క‌థ గుండెజారి గ‌ల్లంత‌య్యిందే సినిమా క‌థ ఒక‌టే. గుండెజారి గ‌ల్లంత‌య్యిందే సినిమా చూసి షాక్ అయ్యాను. అయితే ఒకే ఐడియా ఇద్ద‌రికీ రావ‌చ్చు. అప్పుడు నేను రాసుకున్న క‌థ‌ను మార్చుకున్నాను. ఇప్పుడు ఆ సినిమాకి మా సినిమాకి ఎలాంటి సంబంధం లేదు.

ఈ సినిమాకి ఇళ‌య‌రాజా సంగీతం అందించారు. ఆయ‌న్ని చాలా సెల‌క్టివ్ గా సినిమాలు చేస్తుంటారు క‌దా..? ఎలా ఒప్పించారు..?

నాకు చిన్న‌ప్ప‌టి నుంచి ఇళ‌య‌రాజా మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఈ సినిమాకి క‌థ న‌చ్చే ఆయ‌న సంగీతం అందించారు. నా ఫ‌స్ట్ ఫిలిం ఒక ఊరిలో.. కి దేవిశ్రీ మ్యూజిక్ అందించారు. సెకండ్ ఫిలిం రైడ్ కి హేమ‌చంద్ర మ్యూజిక్ అందించారు. థ‌ర్డ్ ఫిలిం వీర కి త‌మ‌న్ తో వ‌ర్క్ చేసాను. అయితే...ఇళ‌య‌రాజాగారితో వ‌ర్క్ చేయ‌డం నా డ్రీమ్. అది ఈ సినిమాతో నెర‌వేర‌డం చాలా సంతోషంగా ఉంది.

హీరో నాగ శౌర్య గురించి..?

అస‌లు నాగ శౌర్య‌ని నేనే ప‌రిచ‌యం చేయాలి. కానీ కొన్ని కార‌ణాల వ‌ల‌న కుద‌ర‌లేదు. ఏది ఏమైనా ఈ క‌థ‌తో నాగ శౌర్య‌తో సినిమా చేయ‌డం హ్యాపీ. ఈ సినిమాలో నాగ శౌర్య పాత్ర‌కు త‌గ్గ‌ట్టు అద్భుతంగా న‌టించాడు. ఈ సినిమా ఖ‌చ్చితంగా నాగ శౌర్య‌కి మంచి పేరు తీసుకువ‌స్తుంది.

హీరోయిన్ ప‌ల్ల‌క్ గురించి..?

ఈ సినిమాలో హీరో క్యారెక్ట‌ర్ కి ఎంత ఇంపార్టెన్స ఉంటుందో..హీరోయిన్ క్యారెక్ట‌ర్ కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర పేరు ప్రార్ధ‌న‌. అమ్మాయిని చూసిన వెంట‌నే మ‌న ప‌క్కంటి అమ్మాయిలా ఉండాలి. హీరోయిన్ క్యారెక్ట‌ర్ కోసం చాలా మందిని చూసాం. ఫైన‌ల్ గా ప‌ల్ల‌క్ ని ఫైన‌ల్ చేసాం. ప‌ల్ల‌క్ పాత్ర‌కు త‌గ్గ‌ట్గు చాలా బాగా న‌టించింది.

జ‌న‌వ‌రి 1న వేరే సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. మ‌రి ఈ పోటీలో మీ సినిమా స‌క్సెస్ అవుతుందా..?

మా సినిమా పై మాకు పూర్తి న‌మ్మ‌కం ఉంది. బ‌య్య‌ర్స్ విత్ అవుట్ రి రీకార్డింగ్ సినిమా చూసి కొనుక్కున్నారు. అలాగే ఇళ‌య‌రాజా గారు రి రీ కార్డింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు సినిమా చూసి బాగుంది. త‌మిళ్ లో కూడా చేయ‌మ‌న్నారు. త‌మిళ రైట్స్ సి.క‌ళ్యాణ్ తీసుకున్నారు. ఖ‌చ్చితంగా అబ్బాయితో అమ్మాయి స‌క్సెస్ అవుతుంది.

వ‌స్తా నీ వెన‌క సినిమా ఆగింది క‌దా..నెక్ట్స్ ఈ సినిమానే ఉంటుందా..?

ఖ‌చ్చితంగా ఉంటుంది. వ‌స్తా నీ వెనక ట్ర‌యాంగిల్ ల‌వ్ స్టోరి. కాక‌పోతే టైటిల్ వ‌స్తా నీ వెన‌క కాస్త ఇదేదో బాగుంది చెలి గా మార్చాల‌నుకుంటున్నాను. ఈ సినిమా ఓ పెద్ద హీరోతోనే ప్లాన్ చేస్తున్నాను. పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లో చెబుతాను.

More News

జనవరి14న సంక్రాంతి కానుకగా 'ఎక్స్ ప్రెస్ రాజా'

రన్ రాజా రన్,మళ్లీ మళ్లీ ఇది రాని రోజు వంటి సూపర్ హిట్స్ తో దూసుకెళ్తున్న యంగ్ ఎనర్జిటిక్ స్టార్ శర్వానంద్ హీరోగా,వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ వంటి తొలి చిత్రంతోనే బంపర్ హట్ అందుకున్న మేర్లపాక గాంధీ దర్శకత్వంలో

స్పై థ్రిల్లర్ జోనర్లో వరుణ్ కొత్త సినిమా..

ముకుంద,కంచె సినిమాలతో క్లాస్ ఆడియోన్స్ ని ఆకట్టుకున్న వరుణ్ తేజ్ లోఫర్ సినిమాతో మాస్ ప్రేక్షకులను మెప్పించి అటు క్లాస్..ఇటు మాస్...

జనవరి 10న 'సీతమ్మఅందాలు..రామయ్య సిత్రాలు' పాటల వేడుక!

ఉయ్యాల జంపాలా,సినిమా చూపిస్త మామ చిత్రాలతో హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాందించుకున్న రాజ్ తరుణ్ కుమారి 21 ఎఫ్ ' చిత్రంతో హ్యాట్రిక్ ను సాధించి క్రేజీస్టార్ గా మారాడు.

ఎన్టీఆర్ తో ఆ హీరోయిన్...

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మైత్రీ మూవీమేకర్స్ ఓ చిత్రాన్ని నిర్మించనున్న సంగతి తెలిసిందే.

ఆలోచనలో జగపతిబాబు...

హీరోగా వంద చిత్రాల్లో నటించిన జగపతి బాబు లెజెండ్ తో విలన్ గా మారాడు.ప్రేక్షకుల ప్రశంసలు పొందాడు.