Ram Gopal Varma:చంద్రబాబు అరెస్ట్‌పై జూ.ఎన్టీఆర్ మౌనం.. టీడీపీకి ఇక దబిడి దిబిడే, ఆర్జీవీ ట్వీట్ వైరల్
Send us your feedback to audioarticles@vaarta.com
స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత , మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్ట్‌తో దేశం ఉలిక్కిపడింది. తెలుగునాట ఏ ఇద్దరు కలుసుకున్నా ఈ విషయం గురించే చర్చిస్తున్నారు. టీడీపీతో పాటు పలు పార్టీల నాయకులు చంద్రబాబు అరెస్ట్‌ను ఖండిస్తున్నారు. తెలుగుదేశం శ్రేణులు రెండు మూడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తున్నాయి. నారా, నందమూరి కుటుంబ సభ్యులు సైతం జగన్ ప్రభుత్వ తీరును ఖండిస్తున్నాయి. అయితే దివంగత నందమూరి హరికృష్ణ కుటుంబం నుంచి ఆయన కుమారులు కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ మాత్రం చంద్రబాబు అరెస్ట్‌పై పెదవి విప్పడం లేదు. నాలుగు రోజులు కావొస్తున్నా మాట మాత్రంగానైనా కనీసం ట్వీట్ కూడా ఈ అన్నదమ్ములు చేయలేదు. ఇది తెలుగుదేశం శ్రేణులకు, చంద్రబాబు సామాజిక వర్గానికి మింగుడు పడటం లేదు. దీంతో సోషల్ మీడియాలో ఎన్టీఆర్‌పై ట్రోలింగ్ జరుగుతోంది.
మావయ్య అరెస్ట్‌ను తారక్ లైట్ తీసుకున్నారా :
చంద్రబాబు అరెస్ట్‌ను తారక్ లైట్ తీసుకున్నట్లుగానే పరిణామాలు కనిపిస్తున్నాయి. దీనిపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. ఈ మేరకు బుధవారం ఆయన ట్వీట్ చేశారు. ‘‘ చంద్రబాబు అరెస్ట్‌ను జూనియర్ ఎన్టీఆర్ పట్టించుకోవడం లేదు, కనీసం ఖండించడం కూడా లేదు. ఇక టీడీపీ భవిష్యత్తు దబిడి దిబిడే ’’ అంటూ ఆ ట్వీట్‌లో ఆర్జీవీ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ తెలుగు సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
2009 ఎన్నికల తర్వాత చంద్రబాబుకు- ఎన్టీఆర్‌కు మధ్య గ్యాప్ :
2009 ఎన్నికల తర్వాతి నుంచి ఎన్టీఆర్‌కు, చంద్రబాబుకు మధ్య గ్యాప్ బాగా పెరిగిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో ఎన్టీఆర్‌ను టీడీపీ స్టార్ క్యాంపెయినర్‌గా బరిలోకి దించిన చంద్రబాబు.. విస్త్రతంగా ప్రచారం చేయించారు. కానీ టీడీపీకి పరాజయం మాత్రం తప్పలేదు. అటు ఎన్టీఆర్ మాత్రం తాత పోలికలతో , మంచి వాగ్ధాటితో ప్రజల మన్ననలు పొందారు. అంతేకాదు.. తెలుగుదేశానికి భావి వారసుడిగా చర్చకు తెరలేపాడు. తన కుమారుడు లోకేష్‌కు పోటీగా మారతాడనే ఉద్దేశంతో ఎన్టీఆర్‌ను బాబు పక్కనపెట్టాడని ప్రజలు నేటికి చర్చించుకుంటారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం ఓటమి తర్వాత.. పార్టీని ఎన్టీఆర్ చేతుల్లో పెట్టాలంటూ.. సీఎం ఎన్టీఆర్ అంటూ నినాదాలు, జెండాలు ఊపందుకున్నాయి. చంద్రబాబు, లోకేష్ పాల్గొన్న కార్యక్రమాల్లో జూనియర్ అభిమానులు నానా హంగామా సృష్టిస్తూ వుండటంతో వీరిద్దరూ తీవ్ర అసహనానికి గురవుతున్నారు.
The fact that @tarak9999 dint even care about condemning @ncbn ‘s arrest clearly proves that future of TDP is DABIDI DIBIDI
— Ram Gopal Varma (@RGVzoomin) September 13, 2023
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments