Ram Gopal Varma:‘ఓ తాతగారూ మీరింకా ఉన్నారా?’ .. వీహెచ్‌పై సెటైర్లు వేసిన రామ్‌గోపాల్ వర్మ, ట్వీట్ వైరల్
Send us your feedback to audioarticles@vaarta.com
వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ జోలికి ఎవరైనా వెళ్లడానికి భయపడతారు. వెళితే.. తమను తిరిగి ఏమంటారోనని వారికి భయం. అందుకే ఆర్జీవీ చేసే పనులకు ఎవరూ అడ్డుచెప్పరు. చెబితే ఏం జరుగుతుందో అందరికీ తెలిసిందే. అందుకే ఆయన మానన ఆయనను వదిలేస్తారు జినీ జనాలు. అయితే అన్ని తెలిసి కూడా ఓ పెద్దాయన వర్మను మందలించబోయాడు. ఇంకేముంది ఆర్జీవీ తనదైన స్టైల్‌లో కౌంటరిచ్చాడు. ఇంతకీ బాధితుడైన పెద్దాయన ఎవరో కాదు.. కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు.
ఇంతకీ ఏం జరిగిందంటే :
మంగళగిరిలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నిర్వహించిన ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామ్‌గోపాల్ వర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ భూమ్మీద వైరస్ వచ్చి తాను తప్పించి మగజాతి మొత్తం పోవాలని .. స్త్రీ జాతికి తానే దిక్కు అవ్వాలని వ్యాఖ్యానించారు. పైన రంభ, ఊర్వశి, మేనక ఉంటారో లేదో తనకు తెలియదని.. కానీ ఇక్కడే ఎంజాయ్ చేయాలంటూ పిల్లలకు కామ పాఠాలు బోధించారు. అక్కడితో ఆగకుండా తాను యానిమల్ లవర్‌ను కానని, అమ్మాయిలంటేనే ఇష్టమంటూ కామెంట్ చేశారు. అయితే వర్మ ఈ స్థాయిలో చెలరేగిపోతున్నా పక్కనే వున్న మహిళా ఉద్యోగులు ముక్కున వేలేసుకుంటున్నా.. వర్సిటీ వైస్ ఛాన్సెలర్ ఏమాత్రం ఖండించకపోవడం వివాదాస్పదమైంది.
వర్మపై చర్యలు తీసుకోవాలంటూ జగన్‌కు వీహెచ్ లేఖ:
ఈ నేపథ్యంలో వీహెచ్ సీన్‌లోకి వచ్చారు. రామ్‌గోపాల్ వర్మపై చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. మహిళలనుద్దేశించి వర్మ చేసిన వ్యాఖ్యలు సరికావన్న ఆయన.. దీనిపై సినీ పరిశ్రమ నుంచి కూడా ఎలాంటి స్పందనా రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అతనిని ఇలాగే వదిలేస్తే మహిళలను అవమానించడం ఆనవాయితీ అవుతుందని.. వర్మకు దమ్ముంటే ఓయూకి లేదా, కాకతీయ వర్సిటీకి వచ్చి ఇలాంటి వ్యాఖ్యలు చేయాలంటూ వీ హనుమంతరావు సవాల్ విసిరారు. అలాగే నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సెలర్‌ను కూడా సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే టాడా యాక్ట్ కింద వర్మపై కేసు పెట్టాలని వీహెచ్ కోరారు.
మీ లాంటి లీడర్స్ మూలానే కాంగ్రెస్ కి ఆ గతి అన్న వర్మ :
ఇంకేముంది పెద్దాయన జగన్‌కు లేఖ రాసిన విషయం తెలుసుకున్న రామ్‌గోపాల్ వర్మ.. రెచ్చిపోయారు. ‘‘ ఓ తాతగారూ మీరింకా వున్నా..? ‘‘NASA యాక్ట్ వర్తించదు TADA యాక్ట్ ని 1995 లోనే తీసేశారు.. ఇది కూడా తెలియని మీ లాంటి లీడర్స్ మూలానే కాంగ్రెస్ కి ఆ గతి .. ఒకసారి డాక్టర్‌కి చూపించుకోండి’’ అంటూ ట్వీట్ చేశారు.
ఓ తాతగారూ మీరింకా వున్నారా??? https://t.co/iLNuYnFqtw NASA యాక్ట్ వర్తించదు TADA యాక్ట్ ని 1995 లోనే తీసేశారు.. ఇది కూడా తెలియని మీ లాంటి లీడర్స్ మూలానే కాంగ్రెస్ కి ఆ గతి.. ఒక సారి డాక్టర్ కి చూపించుకొండి😘😘😘 pic.twitter.com/eQAOCkByrh
— Ram Gopal Varma (@RGVzoomin) March 19, 2023
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments