Vyooham: ఆర్జీవీ కొత్త సినిమా 'వ్యూహం': బయోపిక్ కాదు, రియల్ పిక్ అంట.. ఎవరినీ టార్గెట్ చేశారో..?
Send us your feedback to audioarticles@vaarta.com
సమకాలీన అంశాలు, రాజకీయాలను ఆధారంగా చేసుకుని సినిమాలు చేయడంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మది విలక్షణమైన శైలి. ఈ విషయాన్ని ఆయన ఎన్నోసార్లు రుజువు చేసుకున్నారు. దేశంలోని పరిస్ధితులతో పాటు తన సొంత ప్రాంతమైన ఏపీ రాజకీయాలపైనా వర్మ ఎన్నో సినిమాలు చేశారు. గతంలో చేసిన ‘‘లక్ష్మీస్ ఎన్టీఆర్’’, ‘‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’’ వంటి సినిమాలు విపరీతమైన హైప్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏపీ రాజకీయాలపై మరో సినిమాను ఎక్కుపెట్టారు ఆర్జీవీ. అదే ‘‘వ్యూహం’’.
వైఎస్ జగన్ బయోపిక్ అంటూ ప్రచారం :
ఈ సినిమాను గతేడాదే అనౌన్స్ చేశారు వర్మ. వ్యూహం, శపథం పేరుతో రెండు పార్టులుగా సినిమా వుంటుందని తెలిపారు. ఇది వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ బయోపిక్కేనంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కానీ వర్మ మాత్రం స్పందించలేదు. తాజాగా తన వ్యూహం ప్రాజెక్ట్ విషయంలో కదలిక తెచ్చారు రామ్ గోపాల్ వర్మ. దీనిపై ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘తాను అతి త్వరలో ‘వ్యూహం’ అనే పొలిటికల్ మూవీ తియ్యబోతున్నానని.. అందరూ అనుకున్నట్లుగా ఇది బయోపిక్ కాదని, బయోపిక్ కన్నా లోతైన రియల్ పిక్ అని వర్మ తెలిపారు.
నూటికి నూరు పాళ్లు నిజాలే చెబుతారట :
బయోపిక్‌లో అబద్ధాలు ఉండొచ్చు కానీ, రియల్ పిక్‌లో నూటికి నూరు పాళ్ళు నిజాలే ఉంటాయని వర్మ ప్రకటించారు. ఈ చిత్రానికి ‘వ్యూహం’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఇందులో జగన్ పాత్రలో అజ్మల్, భారతి పాత్రలో మానస నటించనున్నారు. ‘అహంకారానికి ఆలోచనకు మధ్య జరిగే యుద్ధం’ అని చెప్పారు వర్మ. ఈ చిత్రాన్ని రామదూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నటించే ఇతర నటీనటులు, టెక్నీషియన్ల వివరాలను త్వరలోనే ప్రకటించనుంది చిత్ర యూనిట్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com