సామాన్యుడిలా చార్మినార్ నైట్‌బజార్‌లో రాజమౌళి షికారు... గుర్తుపట్టని జనం, తీరా విషయం తెలిసి
Send us your feedback to audioarticles@vaarta.com
ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమా దేశవ్యాప్తంగా దుమ్ములేపుతోన్న సంగతి తెలిసిందే. రాజమౌళి మరోసారి తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తంగా చాటిచెప్పారని క్రిటిక్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికీ హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో ఆర్ఆర్ఆర్ సత్తా చాటుతోంది. ఈ నేపథ్యంలో రాజమౌళితో సినిమా చేసేందుకు బాలీవుడ్ స్టార్స్ క్యూకడుతున్నారు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తోన్న జక్కన్క వెకేషన్‌కి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారతదేశం గర్వించదగ్గ గొప్ప డైరెక్టర్లలో ఒకరిగా వున్నప్పటికీ రాజమౌళి చాలా నిరాడంబరంగా వుంటారు. హంగులూ ఆర్భాటాలకూ దూరంగా వుంటారు. ఈ నేపథ్యంలో ఆయన హైదరాబాద్‌లోని హిస్టారికల్ ప్లేస్ చార్మినార్ వద్ద సామాన్యుడిలా షికారుకు వచ్చారు.
వివరాల్లోకి వెళితే.. రంజాన్ మాసంలో అర్థరాత్రి దాటాక కూడా చార్మినార్ వద్ద షాపింగ్ హడావిడి కొనసాగుతూనే ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చార్మినార్ అందాలను, మార్కెట్‌లో సందడిని స్వయంగా వీక్షించారు రాజమౌళి. ఈ సందర్భంగా ఓ హోటల్‌లో బిర్యానీ తిని వెళ్లిపోతుండగా కొందరు వ్యక్తులు ఆయనను గుర్తుపట్టి రాజమౌళితో సెల్ఫీలు దిగారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సామాన్యుడిలా నైట్ బజార్ మొత్తం తిరిగిన జక్కన్నను తొలుత అక్కడి వారు గుర్తుపట్టలేకపోయారు. కానీ కొందరికీ డౌట్ రావడంతో వుండబట్టలేక ఆయన వద్దకు వెళ్లి .. సార్ మీరు రాజమౌళియే కదా అని అడిగేశారు. దీనికి ఆయన అవునని సమాధానం ఇవ్వడంతో వారు నమ్మలేకపోయారు. వెంటనే ఈ విషయం చుట్టుపక్కల వారికి తెలిసి మరింత మంది పోగయ్యారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. రాజమౌళి తన నెక్స్ట్ మూవీని సూపర్‌స్టార్ మహేశ్ బాబుతో తెరకెక్కించనున్నారు. ఇందుకు సంబంధించిన కథా చర్చలు ప్రస్తుతం జరుగుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments