దిగ్గజ దర్శకుడు రాజమౌళికి కరోనా పాజిటివ్
Send us your feedback to audioarticles@vaarta.com
దిగ్గజ దర్శకుడు రాజమౌళికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు సైతం కోవిడ్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. తమకు కొద్ది రోజులుగా జ్వరం వస్తోందని.. అంతకు మించి లక్షణాలేవీ లేవని ఆయన తెలిపారు. తాము కోలుకున్న అనంతరం ప్లాస్మా దానం చేయడానికి సిద్ధమని రాజమౌళి వెల్లడించారు.
‘‘కొద్ది రోజుల క్రితం నేను, నా కుటుంబ సభ్యులు జ్వరం బారిన పడ్డాము. అది క్రమంగా తగ్గినప్పటికీ మేము వెళ్లి టెస్ట్ చేయించుకున్నాము. అయితే నేడు ఫలితం.. మైల్డ్ కరోనా పాజిటివ్ అని వచ్చింది. వైద్యుల పర్యవేక్షణలో ప్రస్తుతం మేము హోం క్వారంటైన్లో ఉన్నాము. మాలో ప్రస్తుతం లక్షణాలేమీ లేవు. బాగానే ఉన్నాం. కానీ అన్ని జాగ్రత్తలతో పాటు వైద్యుల సూచనలనూ పాటిస్తున్నాము. యాంటీబాడీస్ డెవలప్ అవడం కోసం వేచి ఉన్నాం. అవి డెవలప్ అవగానే మేము మా ప్లాస్మాను డొనేట్ చేస్తాం’’ అని రాజమౌళి వెల్లడించారు. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు భారీగా కామెంట్లు పెడుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments