జగన్‌తో రాజమౌళి, డీవీవీ దానయ్య భేటీ: టాలీవుడ్ అటెన్షన్, ఈ కలయిక ‘ఆర్ఆర్ఆర్’ కోసమేనా..?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ప్రముఖ దర్శకుడు రాజమౌళి, నిర్మాత డీవీవీ దానయ్య కలిశారు. సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న వారిద్దరూ జగన్‌తో భేటీ అయ్యారు. ఈ నెల 25న ఎన్టీఆర్- రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో వీరి సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.

కాగా... గత కొన్ని నెలలుగా సినీ పరిశ్రమకు, ఏపీ ప్రభుత్వానికి మధ్య టికెట్ ధరలకు సంబంధించి వివాదం నడుస్తోన్న సంగతి తెలిసిందే. అనేక చర్చలు, భారీ కసరత్తు, ఎదురుచూపులు తర్వాత టాలీవుడ్‌కు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో సినిమా టికెట్ ధరలు పెంచుతూ ఇటీవల జీవో జారీ చేసింది. దీని ప్రకారం.. టికెట్ల రేట్లు కనిష్టంగా రూ.20, గరిష్ఠంగా 250 నిర్ణయించింది. ఏరియాను బట్టి థియేటర్లను నాలుగు రకాలుగా విభజించి ధరలను పెంచుతున్నట్లు తెలిపింది. ఈ రేట్లకు జీఎస్టీ అదనం.

హీరో, దర్శకుడి రమ్యూనరేషన్ కాకుండా రూ.100 కోట్ల బడ్జెట్ దాటిన సినిమాలకు రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పించింది ఏపీ సర్కార్. సినిమా విడుదలైన తర్వాత కనీసం 10 రోజులు రేట్లు పెంచుకునేలా అవకాశం ఇచ్చింది. అయితే, 20 శాతం షూటింగ్ ఏపీలో చేసిన సినిమాలకు మాత్రమే రేట్లు పెంపు వర్తిస్తుందని ప్రభుత్వం జీవో పేర్కొంది. కాగా.. చిన్న సినిమాలపై జగన్ సర్కార్ కరుణ చూపింది. చిన్న బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రాలు ఐదు షోలు వేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించింది.

ఇకపోతే.. ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్‌చరణ్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియా భట్‌.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ నటి ఓలివియా మోరిస్‌ కనిపించనున్నారు. శ్రియా శరన్, అజయ్‌ దేవ్‌గణ్‌, సముద్రఖని తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.

More News

అసెంబ్లీని కుదిపేసిన జంగారెడ్డి గూడెం ఘటన.. ఐదుగురు టీడీపీ సభ్యుల సస్పెన్షన్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్‌గా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం ఐదుగురు టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ సభ నుంచి సస్పెండ్ చేశారు.

కేంద్రం కీలక నిర్ణయం.. 12-14 ఏళ్ల వయసు వారికీ కరోనా వ్యాక్సిన్, ఆ రోజు నుంచే

కరోనా మహమ్మారిని అరికట్టేందుకు భారత్ మరింత పకడ్బందీ చర్యలు చేపడుతోంది. ఇప్పటికే దేశ ప్రజలకు రెండు డోసుల వ్యాక్సిన్‌ను అందజేసిన కేంద్రం..

‘ది కాశ్మీర్ ఫైల్స్’ చిత్రానికి ప్రధాని మోడీ అభినందనలు

మిథున్ చ‌క్ర‌వ‌ర్తి, అనుప‌మ్ ఖేర్, ద‌ర్శ‌న్ కుమార్, ప‌ల్ల‌వి జోషి ప్రధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కిన చిత్రం ‘ది కాశ్మీర్ ఫైల్స్’.

మంగళగిరిలో రేపు జనసేన ఆవిర్భావ సభ .. అన్నింటికీ రేపు సమాధానం చెబుతా : పవన్ కల్యాణ్

జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలు సోమవారం గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఇప్పటం గ్రామ సమీపంలో జరగనున్నాయి.

డ్రెస్‌ని బట్టి క్యారెక్టర్ జడ్జ్ చేసేస్తారా.. నెటిజన్లకు సమంత ఘాటు వార్నింగ్

టాలీవుడ్ అగ్ర కథానాయిక సమంత.. ముక్కుసూటిగా వుంటారన్న సంగతి తెలిసిందే. ఎవరేమి అనుకున్నాసరే.. తనకు నచ్చినట్లుగా వుంటుంది.