దర్శకేంద్రుడు హీరోగా.. టైటిల్ ఏంటో తెలుసా?
Send us your feedback to audioarticles@vaarta.com
సీినియర్ దర్శకుల్లో కమర్షియల్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన దర్శకుడు ఎవరు? అంటే మనకు ఠక్కును గుర్తుకు వచ్చే పేరు దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు. ఈ శతాధిక చిత్రాల దర్శకుడు త్వరలోనే వెండితెరపై సందడి చేయనున్నాడు. అయితే ఈసారి దర్శకుడిగా కాదు.. నటుడిగా. ఈయన ప్రధాన పాత్రలో ఓ సినిమా రూపొందనుంది. ఇంతకూ దర్శకేంద్రుడిని డైరెక్ట్ చేయనుంది ఎవరో తెలుసా? నటుడు, రచయిత అయిన తనికెళ్లభరణి. ఈ విషయాన్ని భరణి రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇందులో ముగ్గురు హీరోయిన్స్ ఉంటారట. వారెవరనేది త్వరలోనే తెలియనుంది. సమంత వంటి స్టార్ హీరోయిన్స్ పేర్లే వినిపిస్తున్నాయి. మరి రాఘవేంద్రరావు పాత్ర ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరమైన విషయమే.
ఈ సినిమా టైటిల్ విషయంలో మరో ఆసక్తికరమైన విషయం తెలుస్తుంది. అదేంటంటే.. ఈ చిత్రానికి ‘ఓ బాబూ’ అనే టైటిల్ పరిశీలనలో ఉందట. రాఘవేంద్రరావు తొలి చిత్రం ‘బాబు’. కాబట్టి అలాంటి టైటిల్‌తోనే ఆయన్ని పూర్తిస్థాయి నటుడిగా పరిచయం చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని టాక్ వినిపిస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments