ద‌ర్శ‌కేంద్రుడు హీరోగా.. టైటిల్ ఏంటో తెలుసా?

సీినియర్ దర్శకుల్లో కమర్షియల్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ద‌ర్శ‌కుడు ఎవ‌రు? అంటే మ‌న‌కు ఠ‌క్కును గుర్తుకు వ‌చ్చే పేరు ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు. ఈ శ‌తాధిక చిత్రాల ద‌ర్శ‌కుడు త్వ‌ర‌లోనే వెండితెర‌పై సంద‌డి చేయ‌నున్నాడు. అయితే ఈసారి ద‌ర్శ‌కుడిగా కాదు.. న‌టుడిగా. ఈయ‌న ప్ర‌ధాన పాత్ర‌లో ఓ సినిమా రూపొంద‌నుంది. ఇంత‌కూ ద‌ర్శ‌కేంద్రుడిని డైరెక్ట్ చేయ‌నుంది ఎవ‌రో తెలుసా? న‌టుడు, ర‌చ‌యిత అయిన త‌నికెళ్ల‌భ‌ర‌ణి. ఈ విష‌యాన్ని భ‌ర‌ణి రీసెంట్‌గా ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పారు. ఇందులో ముగ్గురు హీరోయిన్స్ ఉంటార‌ట‌. వారెవ‌ర‌నేది త్వ‌ర‌లోనే తెలియ‌నుంది. స‌మంత వంటి స్టార్ హీరోయిన్స్ పేర్లే వినిపిస్తున్నాయి. మ‌రి రాఘ‌వేంద్ర‌రావు పాత్ర ఎలా ఉండ‌బోతుంద‌నేది ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మే.

ఈ సినిమా టైటిల్ విష‌యంలో మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం తెలుస్తుంది. అదేంటంటే.. ఈ చిత్రానికి ‘ఓ బాబూ’ అనే టైటిల్ పరిశీలనలో ఉందట. రాఘవేంద్రరావు తొలి చిత్రం ‘బాబు’. కాబట్టి అలాంటి టైటిల్‌తోనే ఆయ‌న్ని పూర్తిస్థాయి నటుడిగా పరిచ‌యం చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నార‌ట‌. త్వ‌రలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌నుంద‌ని టాక్ వినిపిస్తోంది.

More News

అభిమానులకు గుడ్ న్యూస్.. సెట్స్‌పైకి పవన్@27

గతంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రారజకీయాలకు ప్రాధాన్యమిచ్చి సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు.

ఆర్జీవీకి ఎఫ్‌డ‌బ్ల్యూఐసీ షాక్‌..!

వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మకు లాక్‌డౌన్ స‌మ‌యంలో క‌రోనా వైర‌స్ వ‌ల్ల ఇబ్బంది క‌ల‌గ‌లేదు.

సౌత్ విల‌క్ష‌ణ న‌టుడితో  క‌త్రినా కైఫ్‌

బాలీవుడ్ స్టార్ హీరోయిన్.. కోలీవుడ్ విల‌క్ష‌ణ న‌టుడు విజ‌య్ సేతుప‌తిలో జోడీ క‌ట్ట‌నుందంటూ సినీ వ‌ర్గాల్లో వార్త‌లు వినిపిస్తున్నాయి.

‘మాస్ట‌ర్‌’కి షాక్‌.. ఆన్‌లైన్‌లో లీక్‌..!

కోలీవుడ్‌ అగ్ర హీరోల్లో విజయ్‌కి షాకులు మీద షాకులు త‌గులుతున్నాయి. ఆయ‌న టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం ‘మాస్ట‌ర్‌’ ఆన్‌లైన్‌లో లీకైంది.

భారతదేశ ముద్దుబిడ్డ లాల్‌ బహుదూర్ శాస్త్రి: పవన్

భారతదేశ మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి వర్ధంతి సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆయనను గుర్తు చేసుకున్నారు.