సరికొత్త ప్రేమ కథాచిత్రం '4 లెటర్స్' చిత్ర దర్శకుడు ఆర్. రఘురాజ్

  • IndiaGlitz, [Friday,February 01 2019]

4 లెటర్స్ మూవీ ఇంజినీరింగ్ స్టూడెంట్స్ ని దృష్టిలో పెట్టుకుని తీసిన సినిమా ఇది..ఈ సినిమా ఇంజినీరింగ్ స్టూడెంట్స్ కి అంకితం ఇస్తున్నాము, అసలు ఈ స్టొరీ ఎలా పుట్టిందో చెపుతాను నేనొక రోజు హైదరాబ SECOND LOOK ఎయిర్పోర్ట్ నుండి క్యాబ్ లో వస్తుంటే కార్లో “SCIENCE IS ABOUT KNOWING, ENGINEERING IS ABOUT DOING..BUT ALL ENGINEERS ARE DYEING” అన్న కొటేషన్ ఒకటి కనిపించి డ్రైవర్ ని అడిగా ఏంటిదని.? సార్ నేనొక B.tech స్టూడెంట్ ని మా అందరికి జాబ్స్ దొరక్క పదివేల రూపాయలకు చిన్న చిన్న జాబ్స్ చేస్తున్నారు..ఇంజినీరింగ్ అంటే వాల్యు లేదని చెప్పగానే,నేను ఆశ్చర్యపోయి కొన్నిరోజులు అతనితో ట్రావెల్ చేసి ఇంజినీరింగ్ చేసిన వారి కష్టాలు తెలుసుకున్నాను,అలా ఈ స్టొరీ పుట్టింది..ఇంజినీరింగ్ స్టూడెంట్స్ కి మా సినిమాలో ఒక మెసేజ్ కూడా ఉంటుంది.

“LOVE AT FIRST SIGHT” అని చెపుతూ ఉంటారు,కానీ అవన్నీ బ్రేకప్ అవుతున్నాయి.. “LOVE AT SECOND LOOK” అనే కొత్త కాన్సెప్ట్ తో మీ ముందుకు వస్తున్నాము..మీ అందరికి నచ్చుతుంది..మా 4 లెటర్స్ ఒక్క యూత్ కే కాదు పెద్దవాళ్ళకి కూడా తప్పకుండా నచ్చుతుంది. వంద సంవత్సరాల సినిమా చరిత్రలో ఎవరు చేయని సాహసం మేము మా సినిమాలో చేశాం,అది మీరు దీయేటర్ లో చూసినప్పుడు మీకు అర్ధమవుతుంది..

ఈ సినిమాలో హీరో ఫాదర్ కి POOR అనే ఫోర్ లెటర్స్ నచ్చవు..మరోవైపు హీరోయిన్ మదర్ కి RICH అనే ఫోర్ లెటర్స్ నచ్చవు..హీరోయిన్ LOVE అనే ఫోర్ లెటర్స్ తో సతమతమవుతుంది..హీరోయిన్ ఫాదర్ జీవితంలో FAIL అనే ఫోర్ లెటర్స్ తప్ప ఏం అనుభవించడు..హీరో ఫ్రెండ్స్ PASS అనే ఫోర్ లెటర్స్ గురించి ఆలోచించరు..యూత్ కి నచ్చే ఫోర్ లెటర్స్ కూడా ఈ చిత్రంలో ఉన్నాయి..

మేము ఈ చిత్రాన్ని రిచ్ లోకేషన్స్ లో చిత్రికరించాం..థాయిలాండ్ లోని ప్రత్వేకమైన ప్రదేశాల్లో పాటలు షూట్ చేశాం..ప్రీ-ప్రొడక్షన్,షూటింగ్,పోస్ట్-ప్రొడక్షన్ తో కలిపి మొత్తం 75 రోజుల్లో ఫస్ట్ కాపీ రెడీ చేశాం..మేము చేసుకున్న ప్లానింగ్ షెడ్యుల్ కి సహకరించిన దొమ్మరాజు భాస్కర్ రాజు గారికి థాంక్స్ చెప్పుకుంటున్నాను..మా సినిమాలో హీరో ఈశ్వర్,హీరోయిన్స్ తువా చక్రబోర్తి మరియు అంకిత మహారాణ లకు మొదటి సినిమా అయిన చాల చక్కగా నటించారు..షూటింగ్ కి ముందు రెండు నెలలు వర్క్ షాప్ పెట్టడం వలన,ఇంత త్వరగా షూటింగ్ పూర్తి చేయగలిగినాము..మార్కెట్ లోకి వచ్చిన మా పాటలు మారుమ్రోగుతున్నాయి దీనికి కారణం

మా మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో,అతనిచ్చిన మ్యూజిక్ సినిమాకే హైలెట్ అవుతుంది..మా DOP చిట్టిబాబు గురించి ఎంత చెప్పినా తక్కువే,చిత్రంలోని పాటలను షూట్ చేసిన విధానం మరియు సన్నివేశానికి తగ్గట్టు లైటింగ్ చేసి మా చిత్రాన్ని ముందుకు తీసుకెళ్ళడంలో అతని తోడ్పాటు మరవలేనిది.. డే వన్ నుండి ఇప్పటి వరకు నేను ఏదడిగినా కాదనకుండా అన్ని సమకూర్చుతూ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మమ్మల్ని ముందుకు నడిపిచ్చిన మా నిర్మాతలు దొమ్మరాజు ఉదయ కుమార్ & దొమ్మరాజు హేమలత గార్లకు ప్రత్వేకంగా థాంక్స్ చెప్పుకుంటున్నాను.

More News

ముఖ్య‌మంత్రి గా బాల‌య్య‌...!!

నంద‌మూరి బాల‌కృష్ణ త‌న త‌దుప‌రి చిత్రానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. దివంగ‌త నేత ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో రాజకీయ ఘ‌ట్టానికి సంబంధించిన 'య‌న్‌.టి.ఆర్ మ‌హానాయ‌కుడు' చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది.

థ్రిల్ల‌ర్ చిత్రంలో బ‌న్ని హీరోయిన్‌...

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అలియాస్ బ‌న్నితో స‌రైనోడు చిత్రంలో లేడీ ఎమ్మెల్యేగా న‌టించిన క్యాథ‌రిన్ థ్రెసా తెలుగు, త‌మిళ చిత్రాల్లో న‌టిస్తూ ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుంది.

మ‌హేష్ వెబ్ సిరీస్ 'చార్లి'....

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ హీరోగానే మ‌న‌కు తెలుసు. అయితే ఆయ‌న త‌న `శ్రీమంతుడు` సినిమాకు ఎంబి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌ను పెట్టి నిర్మాత‌గా మారిన సంగ‌తి తెలిసిందే.

డైరెక్ట‌ర్‌కు డెడ్ లైన్ పెట్టిన స్టార్ హీరో?

మెగాస్టార్ చిరంజీవితో డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి తెర‌కెక్కించిన భారీ చారిత్రాత్మ‌క చిత్రం `సైరా న‌ర‌సింహారెడ్డి`.

'RRR' లో ప్ర‌భాస్ ?

ద‌ర్శ‌క ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రాంచ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం 'RRR'.