'తెర వెనుక' దర్శకుడు వెల్లుట్ల ప్రవీణ్ చందర్ ఇంటర్వ్యూ..
Send us your feedback to audioarticles@vaarta.com
1996 లో వచ్చిన ఆలీ ,ఇంద్రజ ల పిట్టలదొర సినిమా ద్వారా నృత్య దర్శకునిగా పరిచయమై. 2013 లో బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ హీరో గా బెల్ చిత్రం ద్వారా దర్శకుడుగా కెరీర్ మొదలు పెట్టి. 2015 లో దన్ రాజు, దీక్షాపంత్ ,షకలక శంకర్ సుడిగాలి సుదీర్ కాంబినేషన్ లో వచ్చిన బంతిపూల జానకి ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకొని, ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ హీరోగా వెల్లుట్ల ప్రవీణ్ చందర్ దర్సకత్వంలో విజయ లక్ష్మి మురళి మచ్చ నిర్మిస్తున్న చిత్రం "తెర వెనుక".ఈ సినిమా నూతన సంవత్సర శుభాకాంక్షలతో జనవరి 1న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా చిత్ర దర్శకుడు వెల్లుట్ల ప్రవీణ్ చందర్ పాత్రికేయ మిత్రులతో ముచ్చటించారు.
ఏపీ తెలంగాణలో రెండు వందల సినిమా థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేస్తున్నాం క్రైమ్ థ్రిల్లర్ సోషల్ కాజ్ గా వస్తున్న మా సినిమాలో రకుల్ ప్రీత్ తమ్ముడు ఆమన్ ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయం అవుతున్నాడు.
ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో ఇప్పుడున్న సిచువేషన్ లో ఆడవాళ్ళ పై జరుగుతున్న క్రైమ్ థ్రిల్లర్ ను ఈ చిత్రం ద్వారా కొత్తగా చూపిస్తున్నాం. ప్రస్తుతం 101,షి టీములు ఎన్ని ఉన్నా,ఎన్ని జాగ్రత్తలు చెప్పినా ప్రతి మనిషికి స్వీయ రక్షణ ఇంపార్టెంట్ అని ఈ చిత్రం ద్వారా తెలియజేస్తున్నాం క్రైమ్,థ్రిల్లర్స్, ఎన్నో జరుగుతున్నాయి ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయని పాయింట్లు ఇందులో చూపించాము. సబ్జెక్ట్ పాతదే అయినా చెప్పే విధానం కొత్తగా ఉంటే ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. రెగ్యులర్ ఫార్మాట్ లో కాకుండా ఈ సినిమాను కొత్తగా తీయడం జరిగింది.ఇందులో 4 పాటలు ఉంటాయి. 45 రోజుల్లో సినిమాను పూర్తి చేసాం.
హీరో ఆమన్ చాలా చక్కగా నటించాడు.శ్వేతా వర్మ ఇందులో డీజీపీగా చేసిన పోలీస్ క్యారెక్టర్ ఈ సినిమాకే హైలెట్ అవుతుంది.మా సినిమా పోలీస్ డిపార్ట్మెంట్ గురించి తీసినా మాకు పోలీస్ స్టార్స్ గురించి కూడా తెలియదు. అందుకే నేను రిటైర్డ్ డి.ఎస్.పి పెట్టుకొని డిపార్ట్మెంట్ పరంగా ఎంతో శ్రద్ధ పెట్టి ఈమూవీని తీయడం జరిగింది. రియల్ గా పోలీస్ డిపార్ట్మెంట్ కు బట్టలు, క్యాపు,షూస్ ఎవరు కుడతారో వారితోనే కుట్టించాము.పోలీసు వారి క్రైమ్ ఇన్వెస్టిగేషన్స్, ఎలా ఉంటాయి,వారు ఎలా చేస్తారు అనేది ఇందులో చూపించాము.
హీరో హీరోయిన్స్ ఇద్దరు సాఫ్ట్ వేర్ ఎంప్లాయిస్ వారి మధ్య జరిగే లవ్ స్టోరీ, లవ్ స్టోరీ తో పాటు ఒక క్రైమ్ జరుగుతుంది ఆ క్రైమ్ ని ఎలా ఇన్వెస్టిగేషన్ చేశారు అనేది ఈ చిత్ర కథాంశం ఇది ఒక యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ.
ఇండియాలో చాలా చోట్ల జరిగిన క్రైమ్స్ ను ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఈ మూవీ చేయడం జరిగింది. ఇండస్ట్రీ వారు రకుల్ ప్రీత్, సందీప్ కిషన్,మంచు లక్ష్మి, శివారెడ్డి,కాసర్ల శ్యామ్ వంటి చాలామంది మా సినిమాకు సపోర్ట్ చేశారు వారందరికీ ధన్యవాదాలు
మా చిత్రం ఆడియోను సిటీ ఉమేన్స్ ప్రొటెక్ట్ సెల్ డిజిపి సుమతి గారు వచ్చి విడుదల చేయడం చాలా హ్యాపీ గా ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ గురించి తీసినందుకు మేము పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మా సినిమాను డెడికేట్ చేస్తున్నాము .
ప్రస్తుతం కరోనా ప్రాబ్లం తో థియేటర్లలో 50% మాత్రమే ఆక్యుపెన్సీ ఉన్నా.. కమర్షియల్ , మెసేజ్ ఓరియెంటెడ్ గా వస్తున్న మా చిత్రం కొంతమందికైనా రీచ్ అయితే చాలు.ప్రేక్షకులు బిగ్ స్క్రీన్ కు కనెక్ట్ అయినట్టుగా ఓ.టి.టి. ఏ టి.టి. టు లాంటి స్మాల్ స్క్రీన్ కు కనెక్ట్ కారని మా నిర్మాత చెప్పడంతో బిగ్ స్రీన్ లో మా "తెర వెనుక" చిత్రాన్ని విడుదల చేస్తున్నాం.
ఈనెల జనవరి నూతన సంవత్సర శుభాకాంక్షలతో జనవరి 1న వస్తున్న మా "తెరవెనక" చిత్రాన్ని చూసి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం . త్వరలో వస్తున్న నా నాలుగవ సినిమా "సంత" మట్టి మనుషుల ప్రేమ కథ చిత్రం కూడా అద్భుతమైన సినిమా,బ్యాక్ టు బ్యాక్ ఒకేసారి రెండు సినిమాలు రావడం నాకు చాలా ఆనందం ఉంది అని అన్నారు.
నటీనటులు: అమన్, విశాఖ ధిమాన్, దీపిక రెడ్డి హీరోయిన్ లుగా, ఆనంద చక్రపాణి , నిట్టల శ్రీరామమూర్తి , టి.ఎన్.ఆర్ ,శ్వేత వర్మ , సంపత్ రెడ్డి తదితరులు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout