ప్ర‌భాస్ ‘స‌లార్‌’కు అర్థం చెప్పిన డైరెక్ట‌ర్‌

బాహుబ‌లితో ప్యాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్ర‌భాస్ ఏక‌ధాటిగా ప్యాన్ ఇండియా సినిమాల‌ను అనౌన్స్ చేస్తున్నాడు. ఇప్ప‌టికే రాధేశ్యామ్ సెట్స్‌పై ఉన్న సంగ‌తి తెలిసిందే. దీంతో పాటు నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా, ఓంరావుత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న అదిపురుష్ సినిమాల‌ను ఎప్పుడో అనౌన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా కె.జి.య‌ఫ్ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్‌, నిర్మాత విజ‌య్ కిర‌గందూర్ కాంబినేష‌న్‌లో ‘స‌లార్‌’ అనే మ‌రో ప్యాన్ ఇండియా మూవీని అనౌన్స్ చేశాడు. జ‌న‌వ‌రి నుండి ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. రాధేశ్యామ్ త‌ర్వాత విడుద‌ల కాబోయేది ఈ సినిమానే. ఇలా ప్ర‌భాస్ మ‌రో ప్యాన్ ఇండియా మూవీని అనౌన్స్ చేయ‌డంతో ఆయ‌న అభిమానులు సంతోషంలో మునిగి తేలుతున్నారు. దీంతో పాటు అస‌లు స‌లార్ అంటే అర్థ‌మేంట‌ని అంద‌రూ వెతుకుతున్నారు.

అయితే ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్.. ఫ్యాన్‌ను, ఆడియెన్స్‌ను ఎక్కువ టెన్ష‌న్ పెట్టాల‌నుకోలేదు. అందుక‌నే త‌న ట్విట్ట‌ర్ ద్వారా ‘స‌లార్‌’కు అర్థం చెప్పేశాడు. ‘స‌లార్‌’ అంటే రాజుకు కుడి భుజంలాంటి వ్య‌క్తి.. సైనాధ్యిప‌తి అనొచ్చు అంటూ ప్ర‌భాస్‌తో త‌ను చేయ‌బోతున్న సినిమా టైటిల్‌కు వివ‌ర‌ణ ఇచ్చుకున్నాడు ప్ర‌శాంత్ నీల్‌.

More News

గ్రేటర్ ఫలితం: తొలిరౌండ్‌లో ‘కారు’దే జోరు...

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల కౌంటింగ్‌కు సంబంధించి తొలి రౌండ్ పూర్తైంది.

‘ఆచార్య’ కోసం రూ.20 కోట్లతో భారీ సెట్...

మెగాస్టార్‌ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా 'ఆచార్య'.

తెలంగాణ ఎన్నికల సంఘానికి హైకోర్టు షాక్..

జీహెచ్ఎంసీ కౌంటింగ్‌లో స్వస్తిక్ ముద్రతో పాటు ఏ గుర్తు ఉన్నా ఓటుగా పరిగణించాలంటూ నిన్న రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చింది.

నేడు గ్రేటర్ పరిధిలో బొమ్మ పడనుంది...

కొవిడ్‌ మహమ్మారి కారణంగా మూతపడిన మల్టీప్లెక్స్‌లు ఎట్టకేలకు శుక్రవారం తెరుచుకోనున్నాయి.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభం..

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైన ఈ ఓట్ల లెక్కింపుతో 1122 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.