బిగ్‌బాస్ నుంచి డైరెక్టర్ అవుట్.. గేమ్ ఆడటానికెళ్లి రచ్చబండ కబుర్లా..
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ సీజన్ 4 నుంచి డైరెక్టర్ సూర్యకిరణ్ ఎలిమినేట్ అయినట్టు విశ్వసనీయ సమాచారం. ఒక్క వారంలోనే ఆయన అంతులేని నెగిటివిటీని సంపాదించుకున్నారు. సూర్యకిరణ్ నామినేషన్స్‌లోకి వచ్చిన రోజే దాదాపు ఆయన ఎలిమినేషన్ ఖరారై పోయింది. ఆది నుంచి ఆయన ఆట తీరు ప్రేక్షకులకు ఏమాత్రం నచ్చలేదు. డైరెక్టర్‌గా ఎంతో మందిని డీల్ చేసి తన సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన.. బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లాక మాత్రం ఏమాత్రం ఆకట్టుకోలేకపోయారు.
బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లేదే గేమ్ ఆడటానికి కానీ.. సూర్యకిరణ్ ఎక్కువగా పనీపాటా లేని రచ్చబండ కబుర్లే చెప్పారు. పనులు షేర్ చేసుకున్నట్టు కనిపించలేదు సరికదా.. హౌస్‌లో డైరెక్షన్ మొదలు పెట్టి.. ప్రతి ఒక్కరినీ డైరెక్ట్ చేయాలని చూశారు. అంతటితో ఆగినా బాగుండు.. ప్రతి ఒక్కరిపై సెటైర్లు వేసుకుంటూ కాలం గడిపేశారు. బిగ్‌బాస్ నిర్వహించిన టాస్క్‌ల్లో సైతం ఆయన పెర్ఫార్మెన్స్ కనిపించలేదు. గేమ్ ఆడటానికి వెళ్లి అత్తగారింటికి వచ్చిన కొత్త అల్లుడిలా ఏమాత్రం డ్రెస్ నలగకుండా తిరిగితే ఎలా? అందుకే ప్రేక్షకుల్లో సూర్యకిరణ్‌పై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చేసింది.
నామినేషన్స్‌లో అభిజిత్, సుజాత, సూర్యకిరణ్, గంగవ్వ, లాస్య, మెహబూబ్, దివి, అఖిల్ ఉన్నారు. శనివారం నాగ్.. అభిజిత్, సుజాత, లాస్య, గంగవ్వలను సేవ్ చేశారు. నామినేషన్లో సూర్యకిరణ్, మెహబూబ్, దివి, అఖిల్ ఉన్నారు. దివి లాస్ట్ రెండు రోజుల్లో విపరీతంగా ప్రేక్షకుల అభిమానాన్ని గెలుచుకుంది. అఖిల్‌పై నెగిటివిటీ ఏమాత్రం లేకపోవడంతో ఓట్లలో మూడవ స్థానంలో కొనసాగుతున్నాడు. మెహబూబ్.. ఆట తీరును ఇప్పటి వరకూ చూడలేకపోయినా అతనిపై నెగిటివిటీ అయితే లేదు. ఇక మిగిలింది సూర్యకిరణ్ మాత్రమే.
సూర్యకిరణ్‌కు లభించిన ఓట్లను చూస్తుంటే కనీసం తమిళ ప్రేక్షకులు సైతం ఆయనకు ఓట్లు వేసినట్టు కనిపించలేదు. గతంలో బాబా భాస్కర్ తెలుగు వాడు కాకపోయినప్పటికీ ఆయన ఆట తీరుకు మెచ్చి ఆయనను టాప్ 5 వరకూ తీసుకొచ్చారు. అప్పుడు తమిళ ఆడియన్స్‌తో పాటు తెలుగు ఆడియెన్స్ కూడా బాబా భాస్కర్‌కు మద్దతుగా నిలిచారు. కానీ ఇప్పుడు సూర్యకిరణ్‌కు అండగా తమిళులు కూడా లేనట్టు అర్థమవుతోంది. దీంతో హౌస్ నుంచి సూర్యకిరణ్ బయటకు వెళ్లక తప్పని పరిస్థితి నెలకొంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout