నటిగా దర్శకుడి తల్లి...

  • IndiaGlitz, [Tuesday,July 11 2017]

పెళ్ళిచూపులు చిత్రంతో ద‌ర్శ‌కుడిగా మంచి విజయాన్ని అందుకున్నాడు ద‌ర్శ‌కుడు త‌రుణ్‌భాస్క‌ర్‌. మాట‌ల ర‌చ‌యిత‌గా ఇదే చిత్రానికి జాతీయ అవార్డును కూడా అందుకోవ‌డం విశేషం. ఇప్పుడు త‌న రెండో సినిమాను సిద్ధం చేసే ప‌నిలో ఉన్న త‌రుణ్ భాస్క‌ర్ అమ్మ‌గారు గీత‌. ఈవిడ త్వ‌రలోనే వెండితెర‌పై దర్శ‌న‌మీయ‌నున్నారు.
ఇంత‌కు గీత న‌టించినున్న సినిమా వ‌రుణ్ తేజ్‌, శేఖర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న 'ఫిదా' చిత్రంలోన‌ట‌.గీత ఇదివ‌ర‌కు కొన్ని షార్ట్‌ఫిలింస్‌లో న‌టించారు. అయితే వెండితెర‌పై న‌టించ‌డం ఇదే ప్ర‌థ‌మం. ఫిదా సినిమాతో గీత అమ్మ, అత్త పాత్ర‌ల‌తో బిజీ అవుతుంద‌ని యూనిట్ వ‌ర్గాలు అంటున్నాయి. ఫిదా చిత్రం జూలై 21న విడుద‌ల కానుంది.