దానయ్యకు హ్యాండిచ్చిన మారుతి!
Send us your feedback to audioarticles@vaarta.com
‘ప్రతిరోజూ పండగే’ సినిమా ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో తెలిసిందే. గత నెల 20న రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటికీ సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. హీరో సాయి తేజ్‌తో పాటు డైరెక్టర్ మారుతికి కూడా ఇది పెద్ద విజయమే. ఇదిలా ఉంటే.. మారుతి తన తర్వాతి సినిమాను ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య తనయుడితో తీయనున్నారన్న ప్రచారం అప్పట్లో జరిగింది. దీనికోసం ఆయన భారీ రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేశారట. మారుతి గత సినిమాల కంటే అది భారీ మొత్తమేనని టాక్. అయితే ఆ ప్రాజెక్ట్ నుంచి మారుతి తప్పుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రతిరోజూ పండగే సినిమా తర్వాత భారీ సినిమా చేయడానికి ఆయన రెడీ అవుతున్నారని.. ప్రస్తుతం చిన్న సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు దానయ్యతో ఈ విషయాన్ని మారుతి ఖరాఖండిగా చెప్పాడని కూడా సమాచారం. అంతేకాదు తన రెమ్యునరేషన్ కూడా భారీగా పెంచినట్టు చెబుతున్నారు.
మారుతి ఇచ్చిన షాక్‌తో దానయ్య తన మరో దర్శకుడితో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారట. డైరెక్టర్ శ్రీవాస్‌కి ఆ పని అప్పగించినట్టు సమాచారం. తన కొడుకును మంచి హిట్ సినిమాతో లాంచ్ చేయాలన్న ఆలోచనల్లో దానయ్య ఉన్నారు. ప్రస్తుతం దానయ్య ట్రిపుల్ ఆర్ సినిమా చిత్ర నిర్మాణ పనుల్లో బిజీగా ఉన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com