మారుతి మార్కు 'బ్రాండ్‌బాబు'
Send us your feedback to audioarticles@vaarta.com
రైటర్, డైరెక్టర్ మారుతి కథతో బ్రాండ్ బాబు సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రం ద్వారా కన్నడ నటుడు సుమంత్ శైలేంద్ర హీరోగా పరిచయం అవుతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రభాకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను నేడు విడుదల చేశారు.
ఈషా రెబ్బా హీరోయిన్‌గా నటిస్తుంది. మురళీశర్మ కీలక పాత్రలో నటిస్తున్నాడు. జెబి సంగీతం అందిస్తున్నాడు. శ్రైలేంద్ర ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శైలేంద్రబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మారుతి మార్కు ఎంటర్‌టైనర్‌గా సినిమా తెరకెక్కుతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments