'నా లవ్ స్టొరీ' టీజర్ ను లాంచ్ చేసిన దర్శకుడు మారుతి
Send us your feedback to audioarticles@vaarta.com
మహీధర్, సోనాక్షి సింగ్ లను హీరోహీరోయిన్లుగా పరిచయం చేస్తూ అశ్వినీ క్రియేషన్స్ బ్యానర్ పై కె. శేషగిరి రావు నిర్మిస్తున్న చిత్రం 'నా లవ్ స్టోరీ'. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మూవీ టీజర్ ను సెన్సేషనల్ డైరెక్టర్ మారుతి సోషల్ మీడియా లో లాంచ్ చేశారు.కొత్త గా అనిపించే ఈ ప్రేమ కథ తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుంది బెస్ట్ విషెస్ తెలిపారు.
డైరక్టర్ జి. శివ గంగాధర్ మాట్లాడుతూ, ''నేను శివ శక్తిదత్త, సి. ఉమామహేశ్వర రావు, ఈశ్వర్ రెడ్డి, తుమ్మల రమేష్ వంటి ప్రముఖుల దగ్గర పని చేశాను. మారుతి గారి చేతుల మీదుగా టీజర్ లాంచ్ అవడం చాలా ఆనందం గా ఉంది.కథ, కథనాలు మారుతి గారు అడిగి తెలుసుకుని చాలా అభినందించారు. నా లవ్ స్టోరీ సినిమా ప్రస్తుతం షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. టీజర్ రెస్పాన్స్ బాగుంది
ప్రస్తుతం వస్తున్న లవ్ బేస్డ్ కాన్సెప్ట్ సినిమాలకు ఈ సినిమా భిన్నంగా ఉండనుంది. ఈ తరం జనరేషన్ కు సినిమా బాగా నచ్చేలా ఉంటుంద''న్నారు.
చిత్ర నిర్మాత మాట్లాడుతూ, ''డైరక్టర్ మారుతీ గారు కొత్త కాన్సెప్ట్ లను ప్రోత్సహించడం లో ముందు ఉంటారు. అడగగానే టీజర్ రిలీజ్ చేసినందుకు కృతజ్ఞతలు. కాన్సెప్ట్ విని అభినందించారు. అది మా యూనిట్ లో కొత్త ఉత్తేజాన్ని నింపింది. టీజర్ రెస్పాన్స్ బాగుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments