మహిళా జర్నలిస్ట్‌పై మండిపడ్డ డైరెక్టర్ మారుతి..
Send us your feedback to audioarticles@vaarta.com
మాతృత్వం ఓ గొప్ప వరం. అమ్మ అవడం అనేది ప్రతి మహిళకు మరో జన్మ. ప్రతి మహిళ గర్భవతిగా ఉన్నప్పుడు ఏదో తెలియని ఆనందాన్ని పొందుతుంది. అలాంటి ఆనందాన్నే ప్రస్తుతం టీమిండియా సారధి విరాట్ కోహ్లీ సతీమణి, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ పొందుతోంది. అయితే అనుష్కపై ఓ మహిళా జర్నలిస్ట్ అవమానకరమైన వ్యాఖ్యలు చేసింది. దీనిపై టాలీవుడ్ డైరెక్టర్ మారుతి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
మీనా దాస్ నారాయణ్ అనే మహిళా జర్నలిస్ట్ అనుష్క పోస్ట్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘‘అనుష్క, ఆయన మిమ్మల్ని గర్భవతిని మాత్రమే చేసాడు, ఇంగ్లాండ్ రాణిని కాదు, మీ గుర్రాలకు కాస్త కళ్లెం వేయండి’’ అంటూ అసభ్యకరమైన ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలొచ్చాయి. ఈ ట్వీట్‌పై డైరెక్టర్ మారుతి కూడా స్పందించారు. ఒక మహిళా జర్నలిస్ట్ అయి ఉండి అవమానకర వ్యాఖ్యలు చేసిందన్నారు.
‘‘ఒక లేడీ జర్నలిస్ట్ అయి ఉండి.. అవమానకరమైన వ్యాఖ్యలు చేసింది. ఇంగ్లండ్ రాణిగా ఉండటం కంటే మాతృత్వం పెద్ద ఆనందం. ప్రతి స్త్రీ ఒక రాణి.. ప్రతి సంతోషకరమైన ఇల్లు ఒక రాజ్యమే. ఒక సెలబ్రిటీ కావడానికి ముందు ఆమె కూడా ఒక సాధారణ మహిళే. గర్భవతిగా ఉన్నప్పుడు ఆమె సంతోషంగా ఉండటానికి, బేబి బంప్‌ను చూపించుకునేందుకు పూర్తి హక్కు ఆమెకు ఉంది’’ అని ట్వీ్ట‌్‌లో పేర్కొన్నారు.
Disgraceful comments
— Director Maruthi (@DirectorMaruthi) September 14, 2020
That too frm a lady journalist :(
Motherhood is bigger joy than being queen of England
Yes every woman is a queen & every happy home is a kingdom
She's a normal human being too before being a celebrity & she has full right to be happy & flaunt her baby bump https://t.co/QnwX8Uzfy5
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments