Indiaglitz Exclusive : బన్నీని వదిలేది లేదు, టచ్‌లోనే వున్నా.. త్వరలోనే సినిమా : లింగుస్వామి
Send us your feedback to audioarticles@vaarta.com
లింగుస్వామి.. తమిళ స్టార్ డైరెక్టర్. మాస్ పల్స్ ఈయనకు తెలిసినంతగా మరొకరికి తెలియదేమో అన్నట్లుగా వుంటాయి లింగు సినిమాలు. ఒకప్పుడు వరుస బ్లాక్ బస్టర్లతో దక్షిణాదిని మోత మోగించిన లింగు స్వామి తర్వాత ఎందుకో స్లో అయ్యారు. అయితే ఇప్పుడు రామ్ పోతినేనితో తీస్తున్న ‘వారియర్’తో మరోసారి బాక్సాఫీస్ వద్ద తేల్చుకునేందుకు లింగు స్వామి సిద్ధమయ్యారు. టీజర్, ట్రైలర్ ల ద్వారా వారియర్ ఇప్పటికే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. త్వరలోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
చివరి నిమిషంలో అటకెక్కిన అల్లు అర్జున్ - లింగుస్వామి మూవీ:
ఇకపోతే... అన్ని అనుకున్నట్లు జరిగితే ఈపాటికే లింగుస్వామి స్ట్రయిట్ తెలుగు సినిమా రావాల్సి వుంది. కొద్దిరోజుల క్రితమే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో లింగు స్వామి కాంబినేషన్ దాదాపుగా ఖరారైంది. స్క్రిప్ట్ , క్యాస్టింగ్ అన్ని కూడా సెట్ అయ్యాయి. కానీ ఎందుకో అనుకోని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ అటకెక్కింది. కానీ ఈసారి మాత్రం బన్నీని వదిలేది లేదంటున్నారు లింగుస్వామి.
15 రోజుల క్రితం కూడా బన్నీతో మాట్లాడా:
వారియర్ సినిమా ప్రమోషన్ లో భాగంగా ప్రముఖ వెబ్‌సైట్ indiaglitz.comకి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను లింగుస్వామి పంచుకున్నారు. దీనిలో అల్లు అర్జున్ తో ప్రాజెక్ట్ గురించి కూడా ఆయన ప్రస్తావించారు. బన్నీతో రెగ్యులర్ గా టచ్ లో వుంటున్నానని.. కథల గురించి చర్చిస్తున్నట్లు లింగుస్వామి తెలిపారు. 15 రోజుల క్రితం కూడా అల్లు అర్జున్ ను కలిశానని.. తమ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా తప్పకుడా వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అల్లు అర్జున్ తోనే కాకుండా టాలీవుడ్ అగ్రనటులు మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్‌లను కూడా డైరెక్ట్ చేయాలని అనుకుంటున్నట్లు లింగు స్వామి తన మనసులోని మాటను చెప్పారు.
జూలై 14న ప్రేక్షకుల ముందుకు వారియర్:
ఇక వారియర్ సినిమా విషయానికి వస్తే.. భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో రామ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. ఇందులో రామ్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా.. ఆది పినిశెట్టి విలన్ గా కనిపించనున్నారు. జూలై 14న వారియర్ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com